మనిషి తన సౌకర్యాల కోసం ఎన్నో అధునాతన వస్తువులను తయారు చేస్తున్నారు.  అకాశం, నేల, సముద్రం ఎక్కడైనా తన టెక్నాలజీతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.  గత కొంత కాలంగా టెక్నాలజీ పరంగా మనిషి ఎంతో అభివృద్ది సాధించాడు.  ముఖ్యంగా కమ్యూనికేషన్ పరంగా కొత్త కొత్త పరికరాలు కనిపెడుతున్న విషయం తెలిసిందే.  అయితే ఎంత టెక్నాలజీ అభివృద్ది చేస్తున్నాడో..అంతే పతనం వైపు పయనిస్తున్నాడు.  టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి మానసిక స్థితిగతులు కూడా మారిపోతున్నాయి. 

మంచి కోసం ఉపయోగించాల్సిన టెక్నాలజీ చెడు కోసం ఉపయోగిస్తూ..ఎన్నో విశృంఖలాలు సృష్టిస్తున్నాడు. అవసరాలు, మంచి పనులకోసం టెక్నాలజీ వాడుకుంటే మంచిదే..కానీ అదే చెడు పనులకు ఉపయోగిస్తే దాని పర్యవసానాలు ఎంతో దారుణంగా ఉంటాయి.  ఇక మనిషి కనిపెట్టిన అద్భుతమైన వస్తువుల్లో ఒకటి కెమెరా..దీనితో మనకు సంబంధించిన ఫోటోలే కాదు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలను కూడా బంధించవొచ్చు. ఇటీవల కాలంలో కెమెరాల తయారీలో అనేక మార్పులు వస్తున్నాయి.
Image result for screw type cameras
అధునాతన టెక్నాలజీ పుణ్యమాని సీక్రెట్ కెమెరాలు గుర్తుపట్టలేనంతగా తయారవుతున్నాయి. అలాంటివే స్క్రూ తరహాలో వస్తోన్న కెమెరాలు. చూడ్డానికి అచ్చం స్క్రూమాదిరి కనిపించే ఈ కెమెరాలు గుర్తించడం చాలా కష్టం.  ఇలాంటి  స్క్రూ కెమెరాలు హోటల్ రూమ్స్, షాపింగ్ కాంప్లెక్స్ లలోని డ్రెస్సింగ్ రూమ్స్, బాత్ రూమ్స్, వంటి సీక్రెట్ ప్లేసెస్ లో వాటిలో రికార్డు అయిన వాటితో బాధితులను భయపెడుతూ బాధించడం..డబ్బులు వసూళ్లు చేయడం లాంటివి చేస్తున్నారు కొంత మంది ఆకతాయిలు.
Image result for screw type cameras hotel rooms
 అందుకు ఇలాంటి కెమెరాలు ఉంటాయని..కాస్త భద్రం అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ లు వస్తున్నాయి.   ఇంత విపరీతాలు ఉన్నాయని తెలిసి..అసలిలాంటి కెమెరాల తయారీనే అడ్డుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: