తెలుగు, తమిళ ఇండస్ట్రీలో 90వ దశకంలో తన అందమైన నవ్వుతో ఎంతో మంది కుర్రకారు  హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ సుహాసిని.  విశ్వనటుడు కమల్ హాసన్ సోదరుడి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసిన సుహాసిన తెలుగు, తమిళ అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. ప్రముఖ దర్శకులు మణిరత్నం ని వివాహం చేసుకున్న సుహాసని కొంత కాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్లీ తెరపై కనిపించింది. 
Image result for suhasini
ప్రస్తుతం తల్లీ, అత్త పాత్రలతో అలరిస్తున్న సుహాసిని రాజకీయాల గురించి మాట్లాడి అశ్చర్యపరిచారు. రాజకీయాలకు, సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంది. తమిళనాడులో అయితే అది కాస్త ఎక్కువే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వరకూ కొన్ని దశాబ్దాలుగా సినిమా వాళ్లే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. విశ్వనటుడు కమల్‌హాసన్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తమ రాజకీయ తెరంగేట్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
Image result for kamal rajinikanth
వీరిద్దరిలో ఎవరు ముందుగా పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇస్తారు?, ఎవరు రాణిస్తారోనన్న ఆసక్తి తమిళ ప్రజలతో పాటు దేశమంతటా నెలకొంది.  మరోవైపు సీనీ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.  ఈ మద్య ఓ కార్యక్రమంలో సుహాసిన మాట్లాడుతూ..రజనీకాంత్, కమల్‌హాసన్‌ రాజకీయ రంగప్రవేశం గురించి స్పందిస్తూ.. హీరోలే రాజకీయాల్లోకి రావాలా, తాము రాజకీయాల్లోకి రాకూడదా? అంటూ ప్రశ్నించారు.

నటీమణులు రాధిక, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియ కూడా రాజకీయాల్లోకి రావడానికి సై అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ప్రజలు జయలలితకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చారు. మాకూ ఆ బాధ్యతలను అందించండి.. రాజకీయాల్లోకి రావడానికి మేమూ సిద్ధమే’ అని నటి సుహాసిని మణిరత్నం వ్యాఖ్యానించారు.  దీంతో అందరూ ఇక తమిళ రాజకీయాలకు సినీమా కళ రాబోతుందా అని అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: