Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Dec 15, 2017 | Last Updated 6:21 am IST

Menu &Sections

Search

రాయలసీమపై టీడీపీ యాక్షన్ ప్లాన్ తెలిస్తే షాక్..!

రాయలసీమపై టీడీపీ యాక్షన్ ప్లాన్ తెలిస్తే షాక్..!
రాయలసీమపై టీడీపీ యాక్షన్ ప్లాన్ తెలిస్తే షాక్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ అంటేనే కమ్మ సామాజికవర్గం గుర్తొస్తుంది. అది ఓ విధంగా ఆ పార్టీకి ప్లస్ అయితే మరో విధంగా మైనస్ అవుతోంది. పార్టీ అధిష్టానం కమ్మలకే పెద్ద పీట వేస్తుండడంతో మిగిలిన వర్గాలు ఆ పార్టీకి దూరమవుతున్నాయి. ఇప్పుడు ఆ అపవాదు నుంచి బయటపడాలనుకుంటోంది టీడీపీ. ముఖ్యంగా జగన్ సామాజికవర్గంపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. టీడీపీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతోంది. దీని ద్వారా రాయలసీమ రెడ్డి సామాజిక వర్గం నాయకులపై అధికార పార్టీ గురి పెట్టింది. వైసీపీలో బలంగా ఉన్న రెడ్డి నాయకులను లాగేసి... ఆ పార్టీని ఇబ్బందుల్లో పెట్టేందుకు స్కెచ్ వేస్తోంది.

 tdp-operation-akarsh-telugudesam-reddy-rayalaseema

            నంద్యాల ఎన్నికల్లో భారీ విజయం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో చంద్రబాబు అండ్‌ కో సీమ‌కు చెందిన నాయ‌కుల్ని ఆక‌ర్షించడమే ల‌క్ష్యంగా పెట్టుకుందనే టాక్‌ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఆకర్ష్‌ పథకాన్ని అమలు చేసేలా చంద్రబాబు ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలకు బాధ్యతలు అప్పంగిచారట. సీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకోవాలంటే,ఆ వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కి పార్టీలో పెద్దపీట వేయాల్సి ఉంటుంది. సీమ జిల్లాల్లో టీడీపీలోకి వ‌చ్చే రెడ్డి సామాజిక వ‌ర్గ నాయ‌కుల్ని గుర్తించ‌డం, ఆహ్వానించ‌డం, స్థానిక టీడీపీ నేత‌ల‌తో ఆయా వ‌ర్గాల‌కు స‌యోధ్య కుదర్చ‌డం వంటి పనులను సీనియర్ మంత్రులకు అప్పగించారట. మంత్రులు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, ఆదినారాయ‌ణ రెడ్డి, అమ‌ర్ నాథ్ రెడ్డికి ఈ ఆక‌ర్ష్ టార్గెట్‌ ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీమకు చెందిన రెడ్డి వర్గీయుల జాబితా ఒకటి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మంత్రులంతా తమ శాఖల్లోని పనులు సైతం మానుకొని బాబుగారు నిర్ధేశించిన లక్ష్యాల సాధనపై ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారట..

 tdp-operation-akarsh-telugudesam-reddy-rayalaseema

            రాజకీయాల్లో ఏళ్ళ తరబడి ఉండి.. ఒకప్పుడు చక్రం తిప్పి ప్రస్తుతం గోళ్ళు గిల్లుకుంటున్న నాయకుల మీద ప్రధానంగా టీడీపీ అధిష్టానం దృష్టి సారిస్తోంది. వీళ్ళకి ఇంకా ప్రజల్లో ఏ రేంజ్‌లో ఆదరణ ఉందనే అంశాన్ని నిశితంగా పరిశీలించి మరీ... టీడీపీ అధిష్టానం ఓ లిస్ట్ తయారు చేసుకుందట. వీళ్ళకు గాలం వేసేందుకు మంత్రులు రాయబారాలు నడింపించేస్తున్నారని వినికిడి. ఇప్పటికే మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి టీడీపీలోకి వ‌స్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న సంగతి తెలిసిందే. ఆయ‌న పార్టీలోకి వ‌స్తే మైదుకూరు నియోజ‌క వ‌ర్గంతో పాటు క‌డ‌ప జిల్లాలోని మ‌రికొన్ని ప్రాంతాల్లో కూడా టీడీపీకి బ‌లం పెరుగుతుంద‌నేది పార్టీ అధినాయ‌క‌త్వం అంచ‌నాగా తెలుస్తోంది.

tdp-operation-akarsh-telugudesam-reddy-rayalaseema

            మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లాపై ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ని చెబుతున్నారు. ఈ మ‌ధ్య‌ జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డితో త‌ర‌చూ ట‌చ్ లో ఉంటున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఇప్పుడు బైరెడ్డిని టీడీపీలోకి చేర్చుకుంటే… క‌ర్నూలు జిల్లాలో ఆ సామాజిక వ‌ర్గం మ‌ద్ద‌తు పెరుగుతుంద‌నేది వారి అంచనా! డీఎల్ విష‌యంలో కూడా సోమిరెడ్డి తో పాటు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు గుసగుసలు మొదలయ్యాయి.

 tdp-operation-akarsh-telugudesam-reddy-rayalaseema

            మరో మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు... కిశోర్ కుమార్ రెడ్డికి ప‌చ్చ కండువా క‌ప్పేందుకు అమ‌ర్ నాథ్ రెడ్డి చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. దీంతో పాటు అనంత‌పురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల‌కు చెందిన ఇత‌ర నేత‌ల‌పై కూడా ఈ మంత్రులు దృష్టి సారిస్తున్నార‌నీ... వీళ్ళు లిస్ట్‌ అవుట్‌ చేసిన తర్వాత చంద్ర‌బాబు ఓ లిస్ట్ ను ఫైనల్ చేయనున్నారని సమాచారం. దీంతో కొంద‌రి చేరిక విషయ‌మై సీఎం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావాల్సి ఉంద‌నీ, ఆ త‌రువాత ఇంకొన్ని కొత్త పేర్లు కూడా తెర‌మీదికి వ‌చ్చే అవ‌కాశం లేకపోలేదని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

 tdp-operation-akarsh-telugudesam-reddy-rayalaseema

            ఎన్నికలకు మరో రెండేళ్ళు సమయం ఉన్నా... ఇప్పటి నుంచే రాజకీయ పావులు కదుపుతోంది అధికార టీడీపీ. ప్రతిపక్షంలో కీలకమైన వ్యక్తులను అందునా రాయలసీమకు చెందిన రెడ్డి సామజిక వర్గాన్ని టార్గెట్‌ చేస్తోంది. మొత్తానికి, టీడీపీ ఎత్తుగడలకు రెడ్డి ఆకర్ష పథకానికి మొగ్గు చూపి ఎంత మంది కండువాలు మార్చుకుంటారో వేచి చూడాలి.


tdp-operation-akarsh-telugudesam-reddy-rayalaseema
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కర్నూలు కోట కొల్లగొట్టేదెవరు..!? జగనా..? బాబా..??
గుజరాత్ పీఠం మళ్లీ బీజేపీదే..!! హిమాచలమూ కమలానిదే..!! రాహుల్ కు మళ్లీ నిరాశే..!!
ఇదిగో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ..!! ఇవాళే ఫైనల్..!!
ఇదీ ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అడ్వాంటేజ్..!
అజ్ఞాతవాసి ఆడియోలో హైలైట్ ఇదే..!!
పోలవరంపై ఇవాళ పీటముడి వీడిపోతుందా..?
సెకండ్ ఇన్నింగ్స్ లో వెంకీ సెన్సేషన్స్ ఏంటో తెలుసా..?
దుర్గగుడిలో “ఆమె” మాటే శాసనం..!!
ఆ సినిమాతో .. సునీల్ స్టార్ మారబోతోందట.. తెలుసా..?
బర్త్ డే స్పెషల్ : రోబో స్టార్ .. రజనీ..! ఇట్స్ ఏ బ్రాండ్..!!
గుజరాత్ లో మాటల యుద్ధానికి నేటితో చెక్..! పోల్ రేసులో నిలిచేదెవరు?
ఏమాత్రం తగ్గేది లేదంటున్న ఏజ్ బార్ సుందరి!
తెలుగు యువత అధ్యక్షపదవి రేసులో.. రెడ్డి – కమ్మ పోటాపోటీ..!!
కాంగ్రెస్ రారాజు - రాహుల్ గాంధీ..! ముందున్న సవాళ్లేంటి..?
రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ రచ్చ రంబోలానే..!!
టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ వరుణ్ తేజ్..? ఎలాగో తెలిస్తే ఫిదా..!!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.