2017 సంవత్సరానికి సంబంధించి ఇండియా లో బిలియనీర్ ల జాబితా ని ప్రముఖ బిజినెస్ మ్యాగజీన్ ఫోర్బ్స్ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీ ల అధినేత ముఖేష్ అంబానీ వరసగా పదవ సంవత్సరం కూడా టాప్ 1 గా నిలిచి సంచలనం సృష్టించారు. ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాల పాటు ఆయన ఇండియా లో టాప్ ప్లేస్ లో ఉండడం అనేది మామూలు విషయం కాదు అంటున్నారు చాలామంది.

ఇండియాలోని ధనవంతుల సంపద సరాసరిన 26 శాతం పెరిగిందని, స్టాక్ మార్కెట్లో వారి కంపెనీల ఈక్విటీ వాటాల విలువ పెరగడమే ఇందుకు కారణమని 'ఫోర్బ్స్' పేర్కొంది. ముకేష్ అంబానీ ఆస్తుల విలువ నికరంగా 38 బిలియన్ డాలర్లు అని తెలిపింది. ఆసియా లోని బిలియనీర్ లలో ఈ సంవత్సరం అత్యధికంగా సంపద ని పెంచుకుంటున్న వారు ముఖేష్ మాత్రమే అని ఈ మ్యాగజీన్ ప్రకటన చేసింది.

గతేడాది అయన ఆస్తుల విలువ  22.7 బిలియన్ డాలర్లు కాగా, ఏడాదిలో ఆ మొత్తం 67 శాతం పెరిగిందని తెలిపింది.  ఇండియా సంగతి పక్కన పెడితే టోటల్ ఆసియా లో  టాప్-5 బిలియనీర్ల జాబితాలోకి చేరిపోయారని తెలియజేసింది.
ఇండియాలోని వంద మంది అత్యంత ధనవంతుల ఆస్తుల విలువ 479 బిలియన్ డాలర్లుగా 'ఫోర్బ్స్' లెక్కగట్టింది.

ఇండియాలోని టాప్-10 ధనవంతుల జాబితా
1. ముకేశ్ అంబానీ: 38 బిలియన్ డాలర్లు - రూ. 2,48,102 కోట్లు
2. అజీమ్ ప్రేమ్‌ జీ: 19 బిలియన్ డాలర్లు - రూ. 1,24,051 కోట్లు
3. హిందుజా సోదరులు: 18.4 బిలియన్ డాలర్లు - రూ. 1,20,133 కోట్లు
4. లక్ష్మీ మిట్టల్: 16.5 బిలియన్ డాలర్లు - రూ. 1,07,728 కోట్లు
5. పల్లోంజి మిస్త్రీ: 16 బిలియన్ డాలర్లు - రూ. 1,04,464 కోట్లు
6. గోద్రేజ్ కుటుంబం: 14.2 బిలియన్ డాలర్లు - రూ. 92,711 కోట్లు
7. శివ్ నాడార్: 13.6 బిలియన్ డాలర్లు - రూ. 88,794 కోట్లు
8. కుమార బిర్లా: 12. 6 బిలియన్ డాలర్లు - రూ. 82,265 కోట్లు
9. దిలీప్ సంఘ్వీ: 12.1 బిలియన్ డాలర్లు - రూ. 79,000 కోట్లు
10. గౌతమ్ అదానీ: 11 బిలియన్ డాలర్లు - రూ. 71,819 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: