తెలంగాణా లో టీడీపీ పరిస్థితి దాదాపు పాడె మీద శవం లాగా ఉంది. ఇక్కడ తమ పార్టీ ఖ్యాతిని ఆకాశానికి ఎత్తి తమకంటూ ఒక దారి చూపించే నాయకుడు కావాలి అని ఎదురు చూస్తున్నారు జనాలు అందరూ. ఈ టైం లో పార్టీ లోలోపల వెల్లువెత్తుతూ ఉన్న తీవ్రమైన విభేదాలు అదనపు సమస్య గా మారాయి. తమ పార్టీ అస్తిత్వం కాపాడుకోవడం ఎలాగా అనేది వీరి గొడవలకి మూల కారణం అంటున్నారు.


తెరాస బీజేపీ తో వెళ్ళేలా కనపడుతూ ఉండడంతో తాము కాంగ్రెస్ తో వెళ్లక తప్పదు అనుకుంటున్నారు చాలా మంది టీడీపీ నాయకులు. ఒక వర్గం జనాలు కాంగ్రెస్ తో అంటుంటే మరొక వర్గం వారు బీజేపీ తో అంటూ ఉన్నారు టీడీపీ లోనే . అదంతా కులాల వారీగా విభజన ప్రేమ అనుకోవచ్చు. అనంతపురంలో కెసిఆర్‌ పర్యటనపై రేవంత్‌ రెడ్డి విరుచుకుపడటంలో ఆంతర్యం అదే.ఎంఎల్‌సి పయ్యావుల కేశవ్‌తో మాట్లాడడ్డం, వచ్చినప్పుడు కలవమని ఆహ్వానించడం కెసిఆర్‌ వ్యూహంలో భాగమేనని, ఆ సామాజిక వర్గాన్ని మంచి చేసుకోవడం కోసమే బాహాటంగా ఈ సంకేతాలిచ్చారని చెబుతున్నారు.


ఉద్యమ కాలం టైం లో పయ్యావుల కేశవ్ తెరాస కి , తెలంగాణా కి వ్యతిరేకి గా ముందర ఉన్నవారే ఆయనతో కెసిఆర్ క్లోజ్ గా ఉండడం మాత్రమే కాకుండా నంద్యాల ఎన్నికల గురించి సైతం ఎంక్వైరీ చెయ్యడం రేవెంత్ కి కోపం తెప్పించిన అంశం. రేవంత్ రెడ్డి పార్టీ కంటే కూడా వ్యక్తిగత ప్రాధాన్యత కోసం చూస్తున్నారు అనీ , తెలంగాణా లో అత్యున్నత పదవి కి ఎగబాకాలి అనేది అతని ప్లాన్ అని విశ్లేషకులు అంటున్నారు.


రెడ్లు మాత్రమే ఇప్పుడు కెసిఆర్‌ను ఎదుర్కోగలరు గనుక వారికి బలం వున్న కాంగ్రెస్‌తో కలుద్దామని అనడమే గాక సింగరేణి ఎన్నికల్లో రెండడుగులు వేశారు కూడా. అయితే అధికారికంగా తెలుగుదేశం నాయకత్వం ఈ వ్యూహానికి ఆమోదముద్ర వేయలేదు. ఇలా టీటీడీపీ రెండు రెండు రకాలుగా ప్రవర్తిస్తూ రెండు రెండు వ్యవహారాలు నడుపుతూ ఉండడం చాలా ఇబ్బందికర అంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: