పవన్ కళ్యాణ్ ఫాన్స్ vs రేణూ దేశాయ్ కథ ఇవాల్టిది కాదు. ఒకప్పుడు మీడియా కి దూరంగా పవన్ చాటున ఉండే రేణూ దేశాయ్ దాదాపు మూడేళ్ళ క్రితం ట్విట్టర్ , ఫేస్ బుక్ లలో అడుగు పెట్టింది. అప్పట్లో తను తీసిన కొన్ని సినిమాలని ప్రోమోట్ చేసుకోవడం కోసం ఆమె సోషల్ మీడియా ని వేదికగా చేసుకుంది. అయితే ఆ తరవాత కాలం లో ఆమె సినిమా ప్రమోషన్ ల కంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో వేగడం తోనే సరిపోయింది.


వొదినా వొదినా అంటూ పిలుస్తూ పవన్ ఫాన్స్ ఆమెని చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. పవన్ ఫాన్స్ గా పవన్ వరకూ పరిమితం అవ్వకుండా అతని ఎక్స్ వైఫ్ వరకూ వెళ్లి ఆమె ఏం చెయ్యాలి ఎలా ఉండాలి కూడా చెప్పడం నిజంగా రేణూ కి ఇబ్బందికర అంశమే. ఎంతో కొంత ‘ప‌వ‌న్ మాజీ భార్య‌’ అనే ఇమేజ్ రేణు దేశాయ్‌కి హెల్ప్ చేస్తోంది.


ఆమె ఏం మాట్లాడినా సోష‌ల్ మీడియా బూత‌ద్దం వేసుకొని చూస్తోంది. ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా గ‌ట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. రేణు కూడా ఏదోలా ప‌వ‌న్ ఫ్యాన్స్‌కీ, మీడియాకు ట‌చ్‌లో ఉండాల‌ని ప‌రితపిస్తోంది. అయితే ఆమె రెండో పెళ్లి చేసుకునే యోచనలో ఉండడం తో పవన్ ఫాన్స్ దీనికి కోప్పడుతున్నారు. మీరెవరు నాకు చెప్పడానికి అంటూ ఆమె సీరియస్ అయ్యింది. ఆడ‌వాళ్లు చదువుకునేందుకు, పని చేసేందుకు, వారికి ఎమోషనల్ ఫ్రీడం ఇచ్చేందుకు ప్రయత్నించండి… అంటూ కోరుకొంటోంది రేణు. 


నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే అకీరా, ఆద్య ల పరిస్థితి ఏంటి అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫాన్స్ ఓవర్ రియాక్ట్ అవ్వడం చూస్తూ ఉన్నాం. నిజానికి ఒక భారత స్త్రీ గా లా ఆఫ్ దీ ల్యాండ్ ప్రకారం ఆమె ఎవరిని అయినా పెళ్లి చేసుకుని ఎలాగైనా బతికే స్వేచ్చ ఆమెకి ఉంది. ఉత్తి పుణ్యానికి పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకుంటే ప్రశ్నించని అతని ఫాన్స్ " అతని ఇష్టం " అని స్టేట్మెంట్ లు ఇచ్చిన వారు అతని రెండో భార్య రెండో పెళ్లి చేసుకుంటే ఎందుకు అంతగా రియాక్ట్ అవుతున్నారు అనేది ప్రశ్న . అభిమానం ఉండచ్చు గానీ ఒక వ్యక్తి మీద అభిమానం తో అతని మాజీ భార్య జీవితం లో ఎలా ఉండాలి ? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ? చివరకి ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది కూడా డిసైడ్ చెయ్యడం చాలా హాస్యాస్పదం.


మరింత సమాచారం తెలుసుకోండి: