నంద్యాల ఉప ఎన్నికల ఓటమి తరవాత ఎవరూ వైకాప లోంచి  టీడీపీ లో చేరాలి అని నిజానికి అనుకోలేదు. కానీ టీడీపీ మాత్రం ఒక ప్రచారానికి దారి తీసింది. ప్రతిపక్ష వైకాపా  లో ఉండడానికి ఎవరూ ఇష్టపడడం లేదు అనీ అదే టైం కి వైకాపా నంద్యాల లో ఓడిపోవడం తో నాయకులకి ఇప్పుడు సరైన దారి తెలిసి వచ్చింది అనీ ఇక వైకాపా ఖాళీ అవ్వబోతోంది అంటూ మాట్లాడారు ,


అచ్చెన్నాయుడు లాంటి నేతలు అయితే ఫోన్ ల మీద ఫోన్ లు వస్తున్నాయి అనీ వైకపా లోంచి భారీ వలసలు ఉండబోతున్నాయి అనీ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రాయలసీమ నేతలు తమ పార్టీలో రాబోతున్నారు అనే మాటలు కూడా వినపడ్డాయి. అవేమీ జరగలేదు కానీ ఇప్పుడిప్పుడు మాత్రం కొందరు నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు అనీ , టీడీపీ కీలక మినిస్టర్ లతో మంతనాలు సాగిస్తున్నారు అని సమాచారం.


ఇదే త‌రుణంలో అనంత‌పురం జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే గురునాథ రెడ్డి కూడా టీడీపీలో చేర‌బోతున్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, ఈ విష‌యం జ‌గ‌న్ వ‌ర‌కూ వ‌చ్చిందనీ, ఆయ‌న‌తో ఓ కీల‌క నేత చ‌ర్చించార‌ని కూడా అంటున్నారు! ఈ జిల్లాలో జరగబోతున్న యువభేరి లో జగన్ జిల్లా నేతలతో సమావేశం అవుతారు అనీ నేతల మధ్యన ఉన్న విభేదాలు చర్చించి వారిని ఒక తాటి పాకి తీసుకుని వచ్చి జంపింగ్ లు లాంటివి జరగకుండా చూసుకుంటారు అని సమాచారం.


రాయలసీమ ప్రాంతం లో ఐదుగురు వైకాపా నేతల వరకూ జంప్ అయ్యేలా కనిపిస్తూ ఉండగా వారిలో అందరితో జగన్ పర్సనల్ గా మీట్ అయ్యి మాట్లాడే ప్రోగ్రాం పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: