మాతృదేవో భవ..పితృదేవో భవ..ఆచార్య దేవో భవ..అంటూ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం కేవలం గురువులకు మాత్రమే ఇస్తాం.  పూర్వం ఎంత గొప్ప చక్రవర్తి అయినా..తమ పిల్లలను ఆశ్రమాల్లో గురువుల వద్ద విద్యనభ్యసించడానికి పంపించేవారు..అంత గొప్పది గురువు స్థానం.  కానీ నేటి సమాజంలో కొంత మంది గురువులు కీచకులుగా మారుతున్నారు..సభ్య సమాజం తలదించుకునేలా విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పపడుతూ..తలవొంపులు తెస్తున్నారు. 

అయితే గురువులే కాదు ఈ మద్య కొంత మంది టీచరమ్మలు కూడా విద్యార్థులతో లైంగిక సంబంధాలు పెట్టుకొని నీచ సంస్కృతికి తెరలేపుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో పాటియాలా జిల్లాలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యయురాలే పదిహేడేళ్ళ విద్యార్థిపై లైంగికంగా వేధించింది.దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిన పాఠశాల విద్యా కార్యదర్శి కిషన్‌కుమార్ , సర్కిల్ విద్యాధికారణి నిషా జలోభాలు బాలుడిని లైంగికంగా వేధించిన ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. . 

తాజాగా విద్యార్థి ఇంట్లో చెప్పకుండా ఓ ఉపాధ్యాయురాలు అతడిని తీసుకొని వెళ్లిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగింది.    విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వారు వేట మొదలుపెట్టారు. మొత్తానికి విద్యార్థితో సహా ఆ ఉపాధ్యాయురాలిని పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  వివరాల్లోకి వెళితే..కర్నూలు పాతబస్తీకి చెందిన 14 ఏళ్ల బాలుడు సమీప పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

అదే పాఠశాలలో 28 ఏళ్ల యువతి టీచర్‌గా పనిచేస్తోంది.  ఈ నెల 3 వ తేది తెల్లవారు జామున ఇద్దరూ   ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు పాఠశాలలో విచారించగా సదరు టీచరమ్మ, ఆ విద్యార్థి కనిపించకుండా పోయారని తెలుసుకొని విద్యార్థి తల్లిదండ్రులు కర్నూలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికే ఈ విషయంపై రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. 

దీంతో మిస్సింగ్‌ కేసులుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు పరిశీలించగా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వెళ్లినట్టు గమనించారు.  తర్వాత హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కినట్లు గుర్తించారు. 

గట్టి నిఘా వేసిన పోలీసులు విద్యార్థితో పాటు టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని..ఢిల్లీ చూడాలని అంటే తనను తీసుకు వెళ్తున్నానని చెబుతుంది టీచరమ్మ. ఇంట్లో చెబితే పంపరని ఇలా ఎవరికీ చెప్పకుండా వచ్చేసినట్లు పోలీసులకు వివరించినట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: