తెలంగాణ‌లో న‌ల్గొండ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక త‌ప్ప‌ద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించి టీడీపీ స‌త్తా చాట‌డంతో ఇప్పుడు కేసీఆర్ కూడా న‌ల్గొండ‌లో ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి గెలిచి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగా మాన‌సికంగా పైచేయి సాధించేందుకు పావులు క‌దుపుతున్నారు. వాస్త‌వంగా చూస్తే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ ఎన్నిక అన‌వ‌స‌రం. అయితే న‌ల్గొండ‌లో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున విజయం సాధించిన గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరారు.

uma madhava reddy కోసం చిత్ర ఫలితం

దీంతో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచిన ఈ సీటులో ఇప్పుడు టీఆర్ఎస్ అభ్య‌ర్థిని నిల‌బెట్టి గెలిపించుకోవాల‌న్న‌దే కేసీఆర్ ప‌ట్టుద‌ల‌. ఇదిలా ఉంటే ఇక్క‌డ ఉప ఎన్నిక వ‌స్తే టీఆర్ఎస్ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్న‌ప‌రెడ్డి పేరు వినిపిస్తుంటే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ రాజ్‌గోపాల్‌రెడ్డి పేరు లైన్లో ఉంది. మ‌రి టీడీపీ+బీజేపీ నుంచి ఎవ‌రు ఉంటార‌న్న‌ది కూడా ఇప్పుడు ప్ర‌శ్న‌గానే ఉంది.

revanth reddy కోసం చిత్ర ఫలితం

తెలంగాణ‌లో టీడీపీ+బీజేపీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న క‌థ‌నాల ప్ర‌కారం ఇక్క‌డ టీడీపీ నుంచి ఓ అభ్య‌ర్థి పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. ఒకప్పుడు గట్టి ఓటు బ్యాంకు ఉన్న నల్లగొండ జిల్లాలో మళ్లీ తన పట్టును పెంచుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. నల్లగొండ ఉప ఎన్నికలు వస్తే టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. రేవంత్ కూడా అధిష్టానం ఆదేశిస్తే తాను ఇక్క‌డ నుంచి పోటీ చేస్తాన‌ని చెప్పారు. అయితే చంద్ర‌బాబు మాత్ం రేవంత్‌ను బ‌రిలోకి దింపేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది.

tera chinnapa reddy కోసం చిత్ర ఫలితం

న‌ల్గొండ జిల్లా వాళ్ల‌నే ఇక్క‌డ పోటీ చేయించాల‌న్న‌దే బాబు ప్లాన్‌. ఈ నేప‌థ్యంలోనే బాబు మాజీ మంత్రి ఉమా మాధ‌వ‌రెడ్డిని ఇక్క‌డ నుంచి బ‌రిలో దింపేందుకు ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఉమా మాధవరెడ్డి అయితే తాము కూడా మద్దతిస్తామని బీజేపీ చెబుతోంది. ఈ మేరకు బీజేపీ, టీడీపీ నేతల మధ్య కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఉమా మాధ‌వ‌రెడ్డి మంచి సౌమ్యురాలు. న‌ల్గొండ జిల్లాలో ఎలిమినేటి ఫ్యామిలీకి మంచి పేరుంది.  ఇక ఆమె అభ్య‌ర్థిత్వానికి బీజేపీ కూడా మ‌ద్ద‌తు ఇస్తామంటోంది. 

komatireddy rajagopal reddy కోసం చిత్ర ఫలితం

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బీజేపీ న‌ల్గొండ‌లో పోటీ చేసి గెల‌వ‌డం సంగ‌తి ప‌క్క‌న ఉంటే డిపాజిట్లు తెచ్చుకోవ‌డం కూడా గ‌గ‌న‌మే. అందుకే బీజేపీ టీడీపీ నుంచి ఉమా మాధ‌వ‌రెడ్డిని పోటీ చేయిస్తే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నేప‌థ్యంలో ఉమా మాధ‌వ‌రెడ్డి పోటీ చేస్తే ఎంత వ‌ర‌కు స‌త్తా చాటుతారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: