వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల 2 నుంచీ పాదయాత్ర కి సిద్దం అవుతున్నారు. ఈ నేపధ్యం లో సీబీఐ కోర్టు లో ఆయన ఒక పిటీషన్ దాఖలు చేసుకున్నారు. వచ్చే నెల రెండు నుంచీ ఆరు నెలల పాటు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి అనేది ఆయన కోరిక.

అయితే ఎప్పటి నుంచో జగన్ ప్రతీ శుక్రవారం అక్రమాస్తుల కేసు లో కోర్టు కి హాజరు అవుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. పాదయాత్ర నేపధ్యం లో కోర్టు కి రావడం కుదరదు అనేది జగన్ లాజిక్ దీనికి సీబీఐ కోర్టు ఏది చెప్తే అది చెయ్యాల్సి ఉంటుంది.

ఇప్పటికే దీనిమీద మీడియా లో , రాజకీయ పరంగా ఆసక్తి రేగుతూ ఉన్నా కూడా జగన్ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. అయితే మనకి అందుతున్న ఆసక్తికర సమాచారం ప్రకారం బీజేపీ యొక్క తెలివైన ఎత్తుగడ తో సీబీఐ కోర్టు జగన్ కి పర్మిషన్ ఇచ్చేలా చెయ్యబోతున్నారు అని తెలుస్తోంది.

రాష్ట్ర‌ ప్రతిపక్ష నేతగా ప్రజల‌ సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందని, కాబట్టి కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు.

ఈ పిటీషన్ మీద ఈ నెల 13 న విచారణ జరిగి ఫలితం రాబోతోంది , అయితే లాబీయింగ్ ఇప్పటికే జరిగింది అనీ కేంద్రం అండతో జగన్ కి 13 న పాజిటివ్ తీర్పు వస్తుంది అనీ , పాదయాత్ర ప్రారంభం అవుతుంది అనీ అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: