ఆలూ లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్టుగా ఉంది వైసీపీ అధినేత జగ‌న్ ప‌రిస్థితి. ఏపీలో పార్టీ ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారుతోంది. పార్టీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను కూడా జ‌గ‌న్ కాపాడుకోలేక‌పోతున్నాడు. ఇప్ప‌టికే 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోగా ఉన్న‌వాళ్ల‌లో ఎవ‌రు ఎప్పుడు పార్టీ మార‌తారో ?  కూడా ఎవ్వ‌రికి తెలియ‌ని పరిస్థితి. మ‌రి పార్టీ ప‌రిస్థితి ఇంత క్లిష్టంగా ఉంటే జ‌గ‌న్ మాత్రం అప్పుడు తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం అయిపోతాన‌ని, నీకు ఈ శాఖ‌, ఆయ‌న‌కు ఆ శాఖ ఇచ్చేస్తాన‌ని పార్టీలో మిగిలిన వాళ్ల‌కు తెగ హామీల మీద హామీలు గుప్పించేస్తున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ys.jaganmohan reddy కోసం చిత్ర ఫలితం

జ‌గ‌న్ ఇలా అప్పుడే మంత్రి ప‌ద‌వుల‌పై హామీలు ఇవ్వ‌డం వెన‌క చాలా కార‌ణాలే క‌నిపిస్తున్నాయి. పార్టీ నుంచి వెళ్లిపోతోన్న వారిలో న‌మ్మ‌కం క‌లిగించ‌డానికి జ‌గ‌న్ వేసిన ఎత్తు ఒక‌టి అయితే వారితో ఇప్ప‌టి నుంచే పార్టీ కోసం భారీగా ఖ‌ర్చు పెట్టించేందుకు వేసిన మ‌రో ఎత్తుగా కూడా తెలుస్తోంది. ఈ ఖ‌ర్చులు త‌డిసి మెపెడు అవుతున్నాయ్‌... భ‌రించ‌లేం బాబోయ్ అని వైసీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు మొత్తుకుంటున్నా పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఈ శాఖ నీదేగా ఓ సైటో లేదా ఏదో ఒక స్థిరాస్తో అమ్మేయ్ అని జ‌గ‌న్ చెపుతున్నాడ‌ట‌. 


వైసీపీలో ఇదే హాట్ టాపిక్‌:
ప్ర‌స్తుతం వైసీపీ వైఎస్సార్‌కుటుంబం, న‌వ‌రత్నాల కంటే జ‌గ‌న్ పార్టీ నాయకుల‌కు ఇస్తోన్న బంప‌ర్ ఆఫ‌ర్లే పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ నాయ‌కులు ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌ల్లో జ‌గ‌న్ ఎవ‌రికి ఏ మంత్రిత్వ శాఖ‌పై హామీ ఇచ్చాడో లీక్ అయ్యింద‌ట‌. దీంతో వారు అస‌లు పార్టీ ప్ర‌స్తుతం క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తామో ?  లేదో ?  కూడా గ్యారెంటీ లేదు.... అప్పుడే ఈ హామీలు ఎంట్రా బాబు అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఏ ఇద్ద‌రు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు క‌లుసుకున్నా ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. 

ys.jaganmohan reddy కోసం చిత్ర ఫలితం

జ‌గ‌న్ తెలివిగా పార్టీ నాయ‌కులు ఎవ్వ‌రూ టీడీపీ వైపు చూడ‌కుండా ఉండ‌డంతో పాటు వారితో బాగా ఖ‌ర్చు పెట్టించేందుకే ఇలా హామీల మీద హామీలు గుప్పిస్తున్నాడ‌న్న‌ది వైసీపీ వాళ్ల‌కు తెలిసిపోయింది. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌ర్చుల సంగ‌తి ప‌క్క‌న పెడితే జిల్లాల్లో పార్టీని బ‌తికించేందుకు, స్టేట్ వైడ్‌గా పార్టీ కార్య‌క‌లాపాల కోసం కూడా జ‌గ‌న్ పార్టీలో ఆర్థికంగా స్థితిమంతుల‌తో పాటు కొంద‌రు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఉన్న ఎంపీలు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను డ‌బ్బు ఖ‌ర్చు చేయాల‌ని ఒత్తిడి చేయ‌డంతో పాటు వారికి ఈ బంప‌ర్ ఆఫ‌ర్లు ఇస్తున్నాడ‌ని టాక్‌. 


అయితే వైసీపీ వాళ్ల‌లో చాలా మంది జ‌గ‌న్ మాట న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా గ్యారెంటీగా గెలుస్తామ‌న్న ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లి బొక్క బోర్లా ప‌డ్డామ‌ని...ఇప్పుడు కూడా జ‌గ‌న్ మాట న‌మ్మే ప‌రిస్థితుల్లో లేమ‌ని వాళ్ల‌లో వాళ్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.


ys.jaganmohan reddy కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: