భారత దేశంలో సంచలనం సృష్టించిన గుర్మిత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా సాధ్వీలపై అత్యాచారం కేసులో 20 ఏళ్లు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.  ఆయనకు ఉన్న పలుకుబడితో ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూసినా..పథకం బెడిసి కొట్టింది.  దీంతో సాధ్వీలపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన తర్వాత అల్లర్లు రేకెత్తించి అక్కడ నుంచి తప్పించుకోవాలని చూశాడు. అయితే దీనికోసం పథక రచన చేసిన ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ కౌర్ పంచకులలో అల్లర్ల తర్వాత కపినించకుండా పోయింది.
Image result for హనీప్రీత్ సింగ్
 దాదాపు 40మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ అల్లర్లలో హనీప్రీత్ సింగ్ ప్రధాన నిందితురాలిగా పోలీసులు కేస్ ఫైల్ చేశారు . తనను అరెస్ట్ చేస్తారని భయంతో ఆమె నేపాల్ కి పారిపోయిందని..బీహార్ లో ఉందని రక రకాల పుకార్లు వచ్చాయి.  మొత్తానికి ఆమెను ఢిల్లీలో కొనుగొన్నారు పోలీసులు. అప్పటికే ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.
Image result for honey preeth singh jail
ఎట్టకేలకు ఆమెను  పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ దోషిగా తేలిన తర్వాత అల్లర్లు రేకెత్తించేందుకు డేరా సచ్చా సౌధా పంచకుల బ్రాంచ్ హెడ్ చామ్‌కౌర్ సింగ్‌కు హనీప్రీత్ సింగ్ రూ.1.25 కోట్లు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. గుర్మీత్ వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ అయిన రాకేశ్ కుమార్ ను విచారించడంతో ఈ విషయం వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.   
Image result for panchkula
ప్రస్తుతం రాకేశ్ కుమార్ ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీలో ఉన్నాడు. అక్టోబరు 3న హనీప్రీత్‌తోపాటు అరెస్టయిన సుక్దీప్ కౌర్ భర్త ఇక్బాల్ సింగ్ కూడా డేరా కోర్ గ్రూప్‌లో ముఖ్య సభ్యుడని పోలీసులు వివరించారు.
Image result for panchkula
డేరా ప్రాంగణంలో ఆయుధాల నిర్వహణ మొత్తం ఆయనే చూసుకునేవాడని తెలిపారు. పంచకుల డేరా హెడ్ చామ్‌కౌర్‌కు హనీప్రీత్ రూ.1.25 కోట్లు ఇచ్చినట్టు పేర్కొన్న పంచకుల కమిషనర్ ఏఎస్ చావ్లా అంతకుమించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: