డవ్.. పేరు వింటే చాలు సబ్బులు గుర్తొస్తాయి. కేవలం భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డవ్ కు ఎంతో పేరుంది. అయితే ఇటీవల డవ్ తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఆ సంస్థ రూపొందించిన ఓ యాడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొంటోంది.

Image result for dove ad

          డవ్ సబ్బులకు మంచి గిరాకీనే ఉంది. ఇటీవల ఆ సంస్థ ఒక బాడీ వాష్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అది వాడితో నల్లగా ఉండేవాళ్లు తెల్లగా మారిపోతారని చెప్పేలా ఓ అడ్వర్టయిజ్ మెంట్ ను రూపొందించింది. తన అఫిషియల్ ఫేస్ బుక్ పేజ్ ద్వారా ఆ యాడ్ ను రిలీజ్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

Image result for dove ad

          నలుపు తెలుపుగా మారిపోవడం గొప్ప కాదని, నల్లగా ఉండేవాళ్లంతా చెడ్డవాళ్లు, తెల్లగా ఉండేవాళ్లంతా మంచివాళ్లు అనే అర్థం వచ్చేలా ఆ యాడ్ రూపొందించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన అందాన్ని చూపించకుండా .. ఇలా జాత్యహంకారంతో యాడ్ రూపొందించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుభ్రమైన శరీరం అంటే నలుపు తెలుగుగా మారడం కాదని ఓ ప్రొఫెసర్ విమర్శించారు. డవ్ చేసిన పనికి ఇకపై తాను ఆ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్టు చెప్పారు.

Image result for dove ad

          డవ్ ఇలాంటి యాడ్స్ రూపొందించడం కొత్తకాదు. గతంలో కూడా అనేకసార్లు డవ్ యాడ్స్ విమర్శలు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా జాత్యహంకార ధోరణి పెంపొందించేలా ఆ సంస్థ యాడ్స్ ఉంటాయనే ఆరోపణలున్నాయి. అయితే.. యాడ్ పై దుమారం చెలరేగడంతో సంస్థ దిగివచ్చింది. యాదృచ్చికంగానే యాడ్ రూపొందించామని, ఇందుకు చింతిస్తున్నామని ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: