జనం దాదాపు,  ఏం ఖర్మ మొత్తంగానే మర్చిపోయిన ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ తాజాగా యువభేరి అనే కోణం లోంచి మళ్ళీ గుర్త్టు చేసారు. ప్రత్యేక హోదా కి సంబంధించి ఎవరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నా కూడా తాను మాత్రం ఇంకా హోదా విషయం లో వెనక్కి తగ్గేది లేదు అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించేశారు.


మొన్నటి వరకూ తాను తప్ప ఎవ్వరూ ఎ హోదా కోసం పోరాటం చెయ్యలేదు అనీ తానోక్కడినీ చేస్తున్నా కూడా ప్రభుత్వం తనని తోక్కేయడానికే చూసింది తప్ప ఎక్కడా సపోర్ట్ చేసే ప్రయత్నం చెయ్యలేదు అని అన్నారు జగన్. యువభేరి సక్సెస్ ఫుల్ అవ్వడం, ప్రత్యేక హోదా గురించి మళ్ళీ జనం లో పర్ఫెక్ట్  గా తీసుకెళ్ళే ఛాన్స్ ఉండడం తో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి తెలివిగా ప్రవర్తిస్తారు అని సమాచారం.


రాబోతున్న పాదయాత్ర తో జనాల్లోకి వెళ్లి వారిని మెప్పించి , ప్రత్యేక హోదా గొప్పతనం చెబుతూనే సరిగ్గా త్వరలో ఎన్నికలు వస్తాయి అనగా తన ఎంపీ లతో రాజీనామా చేయిస్తారట జగన్ మోహన్ రెడ్డి. ఇదే ఆయన మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు. రీసెంట్ గా జగన్ మాటల కి సపోర్ట్ ఇస్తూ వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే మాట మాట్లాడారు.


ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని, జగన్ చెప్పిన వెంటనే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తామని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అనుకున్న టైం లో జగన్ రాజీనామా అస్త్రం వాడి తీరతారు అని మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: