పాలిటిక్స్‌లో జంపింగ్‌లు అనేవి కామ‌న్‌. ఒక్క‌మాట చెప్పాలంటే రాజ‌కీయాలు పుట్టిన నాటి నుంచి జంపింగ్‌లు ఉన్నాయ‌ని చెప్పొచ్చు. తాజాగా ఏపీలో అధికార టీడీపీ ఇటీవ‌ల కాలంలో జంపింగ్‌ల‌కు కేరాఫ్ అయిపోయింది. ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న వైసీపీని నీరు గార్చ‌డం ద్వారా రాబోయే 30 ఏళ్లు తానే అధికారంలో కొన‌సాగాలని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. అయితే, దీనికి ప్ర‌ధాన అవ‌రోధంగా ఉన్న జ‌గ‌న్ పార్టీని అడ్డు తొల‌గించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌దీశారు. ఫ‌లితంగా ఇప్ప‌టికే 20 మంది జ‌గ‌న్ బై చెప్పి సైకిలెక్కారు. 

operation akarsh కోసం చిత్ర ఫలితం

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ పొగ‌రును, త‌ల‌బిరుసును మ‌రింత‌గా అణ‌చాలంటే.. అస‌లా పార్టీకి నేత‌లే లేకుండా చేస్తే బెట‌ర్ క‌దా? అనే ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్టు తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న పార్టీ సీనియ‌ర్ల‌ను మంగ‌ళ‌గిరికి పిలిచి మ‌రీ వ‌ర్క్ షాపు పేరుతో రాబోయే రోజుల్లో జంపింగ్‌లు ఉంటాయి. కాబ‌ట్టి అంద‌రూ స‌ర్దుకు పోవాలంటూ క్లాస్ పీకారు. అంతేకాదు, వ‌చ్చే కొత్త‌వారితో మీరు చేయి చేయి క‌లిపి.. అభివృద్ధికి సాయ ప‌డాల‌ని కూడా బాబు పిలుపునిచ్చారు. అప్ప‌టికైతే.. నేత‌లు ఓకే అన్నారు. 


కానీ, కొత్త వారిని, అందునా  వైసీపీ నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డంపై టీడీపీ కేడ‌ర్‌లో పూర్తి ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొత్త వారు వ‌స్తే.. త‌మ ప‌రిస్థితి ఏంట‌ని వారు వాపోతున్నారు. ఇప్ప‌టికే వ‌చ్చిన వారితో నేత‌ల‌కు ఎంత‌మాత్ర‌మూ స‌రిప‌డ‌డం లేదు. జమ్మలమడుగు, అద్దంకి, పలమనేరు, కందుకూరు ఇలా అన్ని చోట్లా వైసీపీ నుంచి వ‌చ్చిన నేత‌ల‌తో టీడీపీ నేత‌ల‌కు పొస‌గ‌డం లేదు. ఆధిప‌త్య ధోర‌ణి పెరిగిపోతోంది. అంతేకాకుండా, అధినేత ఆదేశాల విష‌యంలోనూ నేత‌లు త‌లోదారి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

chandrababu-ys.jagan కోసం చిత్ర ఫలితం

దీంతో ఇప్ప‌టికే ఉన్న కుంప‌టి చాల‌ద‌న్న‌ట్టు కొత్త‌గా నేత‌లను ఫిరాయింపుల‌కు ప్రోత్స‌హించ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితిలో అన‌వ‌స‌ర‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఉన్న వారితో ఇబ్బందులు ఏర్ప‌డుతున్న నేప‌థ్యంలో కొత్త‌వారిని ప్రోత్స‌హించ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అదేస‌మ‌యంలో బాబు ఊహించిన‌ట్టు నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెరిగే అవ‌కాశం లేదు. ఒక‌వేళ నియోజ‌క వ‌ర్గాలు పెరిగే సూచ‌న‌లు ఉంటే ప‌రిస్థితి వేరేగా ఉండేది. 


కానీ, ఇప్పుడు ప‌రిస్థితి బ్యాడ్‌. సో.. ఉన్న సిట్టింగుల‌కు సీట్లివ్వాలా?  లేక కొత్త‌గా ఫిరాయించే వారికి సీటు కేటాయించాలా? ఇది కూడా అధినేత‌కు పెద్ద స‌మ‌స్య‌. ఇప్ప‌టికే పంచాయితీలు తీర్చ‌లేక బాబు నానా తిప్ప‌లు ప‌డుతున్న నేప‌థ్యంలో కొత్త స‌మ‌స్య‌లు ఎందుక‌ని అంటున్నారు సీనియ‌ర్ నేత‌లు. ఇవ‌న్నీ చూస్తుంటే బాబు గారి ఆప‌రేష‌న్ విక‌టించ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రి బాబు దీనిపై ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. 

operation akarsh కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: