గత ఆదివారం వరకు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతికి రఘురాం రాజన్ పేరు ప్రచారం లో ఉందింది. కాని ఆ బహుమతి చివరిదశలో రఘురాం రాజన్ సహచరుడు ప్రొఫెసర్ రిచర్డ్ థాలెర్ ను వరించింది. అయితే ప్రొఫెసర్ రిచర్డ్ థాలెర్ భారత ఆర్థిక దిగ్గజాలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా, "రఘురాం రాజన్ ను వదులుకుని భారత్ పెద్ద తప్పు చేసింది" అని" వ్యాఖ్యా నించటం జరిగింది.   ఆర్థిక విభాగంలో నోబెల్ బహుమతి సాధించిన ప్రొఫెసర్ రిచర్డ్ థాలెర్ తన సహ ఉపాద్యాయుడు రఘురాం రాజన్ ను ఈ విధంగా ప్రస్తుతించటం తో భారతీయ ఆర్ధిక వేత్తలలో రాజన్ ను కోల్పోవడానికి దారి తీసిన భారత రాజకీయ పరిస్థితులను ఇప్పుడు చర్చించుకోవటం ప్రారంభించారు.  
 

రఘురాం రాజన్ భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ సమగ్ర స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. గ్రామీణ భారతం లో నేడు బ్యాంకు శాఖల ఏర్పాటు ఆయన వల్లే సాధ్యమైంది. అంతే కాదు ప్రతి పౌరునికి ముఖ్యంగా ప్రతి పేదవానికి బాంక్ ఖాతా ఉండాలని ఆయన తపించటమే అందుకు సాక్ష్యం. ఇంతకు ముందు పనిచేసిన భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ లలో అతి కొద్ది మంది మాత్రమే రఘురాం రాజన్ స్థాయిలో బ్యాంకింగ్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించారు. 


Image result for thaler about rajan

మరి ఇంతటి ఆర్థిక శక్తిని భారత్ ఎందుకు పోగొట్టుకున్నది? అన్నదానిపై ఎంతగా చర్చించినా అది సమాధానం దొరకని ప్రశ్నగానే భావిస్తున్నారు. ఇదే విషయాన్ని నిష్కర్ష గా వెల్లడించారు రిచర్డ్ థాలెర్.  రఘురాం రాజన్ వంటి అద్భుత ఆర్థిక నిపుణుడు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశానికి  లభించడం దైవికం అనే స్థాయిలో కామెంట్లు చేశారు. 


అయితే రఘు రాం రాజన్ ను భారత్ కోల్పోయి నష్టపోయినా, అమెరికా మాత్రం ఆయన్ని తిరిగి పొంది లాభపడుతుందని,  ప్రొ. థాలెర్ చెప్పడం పెద్ద విశేషం. చికాగో యూనివర్శిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో రఘురాం రాజన్ ఇప్పుడు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ప్రొ. రిచర్డ్ థాలెర్ కూడా అందులో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉండటంతో చాలా దగ్గరగా ఉండి రఘును పరిశీలించే అవకాశం దొరికి ఉండవచ్చు. అంతేకాదు నోబెల్ బహుమతి కోసం థాలెర్, రాజన్ తో పోటీ పడ్డారు కూడా!  అయితే కొద్ది తేడాతో రఘురాం రాజన్, నోబెల్ పురస్కారాన్ని కోల్పోయారు.

"నేడు  రాజన్  కు నోబెల్ బహుమతి రాలేదు కాని,  భవిష్యత్తు మాత్రం ఆయనకు నోబెల్ పురస్కారం అందించి తీరుతుంది"  అని కూడా థాలెర్ స్పందించారు. రఘురాం తిరిగి అధ్యాపక వృత్తిలోకి రావటం తనకెంతో సంతోషంగా ఉందని అంటూనే,  "ఆయన్ను వదులు కోని భారత్ నష్టపోయింది" అని చెప్పారు. గతంలో కూడా ఇదే స్కూల్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తూనే ఉన్న రఘురాం రాజన్ ను, అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆర్బిఐ గవర్నర్ గా నియమించగా,  అక్కడ మూడేళ్ల పాటు సెలవు తీసుకుని, ఇండియా కు వచ్చారు. ఆయన మూడేళ్ళ పదవీ కాలం పూర్తి కావడంతో రాజన్ ను కొనసాగించేందుకు భారత ప్రధాని మోదీ అంగీకరించలేదు. దీంతో ఆయన తిరిగి తన తొలి స్థానానికి అంటే ప్రొఫెసర్ గా వెళ్లిపోయారు.  


Image result for thaler about rajan


భారత్ ఆర్థిక విషయాలపై ఒక సారి స్పందించిన రఘురాం రాజన్,  ".. ప్రభుత్వం చేసిన పెద్ద నోట్లు రద్దు ను తీవ్రమైన చర్యగ అభివర్ణించారు. భారత ఆర్థిక పరిస్థితి క్రమ క్రమంగా గాడిన పడే సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తే అభివృద్ది కుంటు పడుతుందని అది దేశానికి మంచిది కాదని"  ఆయన చెప్పడం కూడా ఆర్థిక నిపుణులను ఆలోచనల్లో పడేసింది. 


అయితే బీజేపీ సీనియర్ నేత, మాజీ ఆర్ధిక శాఖామాత్యులు యశ్వంత్ సిన్హా కూడా ఇదే విషయంపై మోదీని ఉతికి ఆరేశారు. రఘురాం రాజన్ స్థానంలో ఆర్ బి ఐ గవర్నర్ గా గుజరాత్ కు చెందిన ఉర్జిత్ పటేల్ ను ప్రదాని  నరేంద్ర  మోదీ ఎంపిక చేసి మరీ ఆర్బీఐ గవర్నర్ ను చేయడం, తరవాత ఆయన చర్యలతో ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు. అంతే కాదు ప్రస్తుతం ఉర్జిత్ పటేల్ కూడా అసంతృప్తితో రగులుతున్నారనే తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: