ప్రత్యెక హోదా ఉద్యమం ఇక ముగిసిన కథ అనుకుంటున్న టైం లో దానికి పునర్జీవం పోస్తున్నారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి. తన పాదయాత్ర విషయం తో పాటు అనేక విషయాలలో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. ప్రత్యేక హోదా సాధన లో చివరి ఘట్టంగా , అస్త్రం గా ఎంపీల రాజీనామాలు కూడా చేయిస్తాం అన్నారు.

ఇప్పుడు దీనిమీద రకరకాల విశ్లేషణలు వినపడుతూ ఉన్నాయి. కెసిఆర్ ఇచ్చిన స్ఫూర్తి తోనే జగన్ ఇప్పుడు రాజీనామాల మాట ఎత్తుతున్నారు అనేవారు ఎక్కువ అయ్యారు. ఎన్నికలకి సరిగ్గా కొన్ని నెలల ముందర జగన్ తన ఎంపీ లతో రాజీనామా చేయిస్తారు అనీ అదే ఆయన వ్యూహం అనీ చెబుతున్నారు.

ఆ ఊపు తో ఎన్నికలకి వెళితే ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనేది వైకాపా ప్లాన్. తెలంగాణ సాధ‌న‌ ఉద్య‌మాన్ని స‌జీవంగా ఉంచేందుకు నాడు కేసీఆర్ కూడా ఇదే ఫార్ములాను అనుస‌రించార‌నీ, దాన్నే ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ ఫాలో అవుతున్నారంటూ కొంత‌మంది విశ్లేషించేస్తున్నారు. రాజీనామాలతో ఎప్పటికప్పుడు ఉక్కిరిబిక్కిరి చేయడం తెలంగాణా ఉద్యమం టైం లో జరిగిన బలీయమైన అంశం.

అప్పట్లో ఆ సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉండేది దాన్ని అలా ఉంచడం కోసం కెసిఆర్ అలా చేసేవారు. అయితే ఇప్పుడు తెలంగాణా ఉద్యమం ఉన్నంత బలంగా జనాల మనసులలో ప్రత్యేక హోదా విషయం ఉందా అంటే అబ్బే లేదు అనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: