వై ఎస్ రాజశేఖర్ రెడ్డి  కొడుకు గా, ఆయన్ని నమ్ముకున్న కోట్లాది మంది బాధ్యత ని నెత్తిన వేసుకున్న పొలిటికల్ లీడర్ గా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి అని చాలా మంది కోరిక. జగన్ వస్తే తమ బతుకులు మారతాయి అనేది చాలామంది ఫీల్ అవుతున్న సిద్దాంతం. జగన్ మోహన్ రెడ్ది రానున్న రెండో తారీఖు నుంచీ పాదయాత్ర చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యం లో జగన్ తన పార్టీ శ్రేణుల తో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరీ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం తన పాదయాత్ర చూసి తత్తరపడాలి అనీ వారి ప్రభుత్వం పునాదులు కాదలాలి అంటూ జగన్ అన్నట్టు తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ నేతలు అందరినీ తన పాదయాత్ర జరుగుతున్న టైం లో ఆయా జిల్లాలలో సమాంతరంగా ప్రోగ్రాం లు పెట్టుకోవాలి అని ఆర్డర్ వేసారు. దీని బట్టి చూసుకుంటే జగన్ ఈ యాత్ర ని చాలా గట్టిగానే తీసుకునట్టు తెలుస్తోంది.

అయితే ఒక్క విషయం లో మాత్రం జగన్ కాస్త జాగ్రత్త పడక తప్పదు. చంద్రబాబు మీద , ఆయన పాలన మీదా విరుచుకుపడే జగన్ ఇప్పుడు తన నేతలతో కూడా పాదయాత్ర లక్ష్యం చంద్రబాబు ని దించడమే అన్నట్టు మాట్లాడుతున్నారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యం కూడా ఒకప్పుడు అలాగే ఉండేది కానీ ఆయన శైలి మాత్రం చాలా డిఫరెంట్.

రాష్ట్రంలో ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నారూ, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారూ, సామాన్యులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారూ.. వారంద‌రికీ భ‌రోసాగా పాద‌యాత్ర చేస్తున్నాం అనేది అప్పట్లో ఆయన స్టైల్ , అలానే  నే జగన్ ఫాలో అయితే బాగుంటుంది తప్ప చంద్రబాబు మీద విమర్శలతో వెళితే ముఖ్యమంత్రి కుర్చీ కోసమే జగన్ పోరాటం అని అపార్ధం చేసుకునే ఛాన్స్ చాలా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: