కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే - సీఎల్పీ ఉప నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి కీ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కీ మధ్యన ఏం వార్ నడిచింది? ఆయన ని ఫోన్ చేయొద్దు అని కెసిఆర్ ఒకప్పుడు ఆదేశించారా ? గంటల తరబడి మాట్లాడుకునే వీరిద్దరూ ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నారు ? అంటూ అనేక ప్రశ్నలకి ఆన్సర్ చెబుతున్నారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి.

ఒక మీడియా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన అనేక విషయాలు చెప్పుకొచ్చారు. కెసిఆర్ మీద తీవ్ర స్వరం తో అసహనం వ్యక్తం చేసారు రెడ్డి. స్వరాష్ట్ర పాలన అంటే ఇంత దిక్కుమాలిన తనంగా ఉంటుంది అని తాను అనుకోలేదు అన్నారు కోమటి రెడ్డి. తెలంగాణ ప్రజలు గొర్రెలు - బర్రెలు - చేపలు - చీరలు కోరడం లేదని నిధులు - నీళ్లు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చినందుకు ఉద్యోగాలు కోరుతున్నారని కోమటిరెడ్డి చెప్పారు.


బలిదానాల తో ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం లో మూడు ఎకరాల భూమి కోసం దళితులు చనిపోవడం అనేది కెసిఆర్ ప్రభుత్వానికి అతిపెద్ద సిగ్గుచేటు అన్నారు ఆయన. ఒకప్పుడు ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో దాదాపు రెండు గంటలు తనతో మాట్లాడిన కెసిఆర్ తన సమస్యలు అన్నీ విన్నారు అనీ తరవాత కాలం లో నియోజికవర్గం కి సంబందించిన పెండింగ్ పనుల నిమిత్తం వారం రోజుల పాటు ఫోన్ చేసినా కూడా కెసిఆర్ ఫోన్ ఎత్తడం లేదు అన్నారు కోమటి రెడ్డి. 

‘మీతో మాట్లాడనని సీఎం చెప్పారండీ - మీరిక ఫోన్ చేయొద్దు’ అని సీఎం పేషీ నుంచి బదులిచ్చారని కోమటిరెడ్డి వాపోయారు. ' రెండేళ్ళ నుంచీ కెసిఆర్ అప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నా , ఇప్పటి వరకూ దిక్కు లేదు ' అని కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: