రోజు ఏదో మూల సామాన్య ప్రజలపై పోలీసుల దౌర్జన్యం, దాష్టీకం, కాఠిన్యం, కర్కశం చూపుతున్న వార్తలు వింటున్నాం. ఇది సమాజానికి చాలా కీడు చేసే విషయం. ఎవరైనా నేఱస్తుడు నేఱం చేస్తే వాళ్ళను విచారించి శిక్షలకు గురిచెయ్యాల్సిన పోలీసు లు అధికారులు ఆ నేఱాలకు సాధారణ శిక్షలు మాత్రమే విధిస్తే చాలదు. కారణం వారి శక్తి సామర్ధ్యాలను ఉపయోగించి ప్రజల కు సేవచెయ్యాల్సిన వాళ్ళు అలాచేస్తే "కంచే చేను మేసినట్లవదా?" రక్షకుడే భక్షకుడైతే వారికా శిక్షలు చాలవు.   


కృష్ణా జిల్లాలో ఒక పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ కర్కశ స్వరూపం బయటపడింది. ప్రజల్లో ఆయన నిర్వాకం సంచలనం రేపుతోంది. ఈ మధ్యనే హనుమాన్‌ జంక్షన్‌ పోలీస్ స్టేషన్ లో ఎస్‌ఐ గా పనిచేసే విజయ్‌కుమార్‌, నూజివీడుకు చెందిన ఒక బ్యూటీపార్లర్‌ నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం కొనసాగించి ఋజువవటం తో సస్పెండైన సంఘటన మరువకముందే, తాజాగా అదే జిల్లాలో చోట మరో ఎస్‌ఐ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా నూజివీడు లో పనిచేసే వెంకటకుమార్‌ అనే ఎస్‌ఐ, తన వద్దకు రక్షణ ఆసించి వచ్చిన ఒక వివాహితను ఆ తరవాత మొబైల్ ఫోన్‌ లో లైంగిక వేధింపులకు గురిచేసిన వైనం రాష్త్రం లో కలకలం రేపుతోంది.


ఈ ఘటనపై స్పందించిన ఆ జిల్లా ఎస్పీ త్రిపాఠి ఆ ఎస్‌ఐ ని పిలిచి చీవాట్లు పెట్టారు. ఆ తరవాత అతనిపై మూడు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేసి తదనుగుణంగా ఎస్పీ త్రిపాఠీ ఆదేశాలు కూడా జారీశారని తెలుస్తోంది.


ప్రభుత్వోద్యోగి భార్య అయిన బాధిత మహిళ ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తోంది. భర్త కేసు విషయంలో ఓ సారి నూజివీడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఎస్సై వెంకట్ కుమార్ చూపు బాధితురాలిపై పడింది. అప్పటి నుంచి ఆమెకు ఫోన్‌ చేసి వేధింపులు మొదలుపెట్టాడు. అంతేకాదు తనతో గడిపితే నీ భర్తను కేసు నుంచి తప్పిస్తానని ఎస్సై వెంకట్ కుమార్ ఆఫర్ ఇచ్చాడు.


“నీ అందానికి ఫిదా అయిపోయా.. ఒక్కసారి రూమ్‌కి రావా?" అంటూ వేధిస్తూ... రకరకాల వెకిలి చేష్టలతో వేధించాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని, తనను వేధించవద్దని ఆమె ఎంత ప్రాధేయపడ్డా కేసు నుంచి తప్పించాలంటే లాడ్జికి రావాల్సిందే నని, తనతో గడపాల్సిందేనని ఆ సబ్-ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశాడు. ఎస్ఐ వేధింపులకు విసిగిపోయిన ఆమె అతడి ఫోన్ సంభాషణలను రికార్డు చేసింది. అ ఆ రికార్డులను జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు వినిపించింది. అతగాడి వేధింపులు భరించ లేకపోతున్నానని, చావే తనకు శరణ్యమని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


అతనిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. తన భర్తకు సంబందించిన కేసు విషయంలో సహాయం కోరుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆ వివాహితను న్యూజివీడు ఎస్సై వెంకటకుమార్‌, సహాయం చేసే పని వదిలేసి  ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించారు. ఆమె ఫోన్‌ నంబర్లు తీసుకొని, తరచూ ఫోన్‌లో మాట్లాడు తూ ఆమెను మానసికంగా లైంగికం గా వేధించారు. 


"తన కోరిక తీర్చాలని, లేదంటే నీ భర్తను ఈ కేసులో ఇరికిస్తాను" అని ఎస్సై నీచాతి నీచంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. "తనను వేధించవద్దని, ఏదైనా అల్లరి జరిగితే తనకు ఆత్మహత్యే శరణ్యమని, తనను కరుణించి కాపాడమని ఆమె పదే పదే వేడుకుంటున్నా ఆ ఎస్‌ఐ లో కనీస కనికరం కలగలేదు సరికదా వేదింపుల తీరు పెంచేశి ఆమెను వ్యధకు గురి చెదస్తున్నట్లు తెలుస్తుంది. 


ఆమె వేడుకున్నా వినకుండా గత కొద్ది రోజులుగా అదే పనిగా ఫోన్‌ చేసి తీవ్రంగా వేధిస్తుండటంతో ఆ పరిస్థితుల్లో  ఆమె.. ఆ ఫోన్‌ కాల్స్‌ను రికార్డ్‌ చేసి, కృష్నా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫోన్‌ కాల్స్‌ రికార్డింగ్స్‌ పై స్పందించిన జిల్లా ఎస్పీ.. ఎస్సై గత చరిత్రపై ఆరా తీయగా.. వెంకటకుమార్‌ గురించి అనెక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్సైపై ఎస్పీ వేటు వేశారు.

 
పోలీస్ శాఖ ఇలాంటి వాళ్ళను రెండు మూడు నెలలు సస్పెండ్ చేసినంత మాత్రాన వాళ్ళలో మార్పును ఆశించలేమని అలాంటి వారిని ఆ భాధ్యాతా యుతమైన ఉద్యోగాలనుంచి తొలగించి కఠిన కారాగార శిక్షలు విధించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. రక్షక భటులే రాక్షస మూకలౌతున్న పోలీస్ సమాజములో మార్పు రాదా? 

Image result for sexual assult on Indian women by police

మరింత సమాచారం తెలుసుకోండి: