125 కోట్ల ప్రజానీకం, వేల సంఖ్యలో వివిధ బాషలు కులాలు, పదుల్లో అనేక మతాలు, భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు అంతా భిన్నత్వం లో ఏకత్వంగా కలసిమెలసి సాధించిన మన బ్రాండ్  "లౌకికత్వం" అలాంటి దేశానికి చెందిన ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ యువరాజు - భవిష్యత్ ప్రధాన మంత్రి పదవి ఆశించే గాంధి-నెహౄ ల వారసుడు రాహుల్ గాంధి  "లేడీస్ టాయిలెట్" కి దూరేసరికి చూస్తున్న వారంతా నివ్వెరపోయారు.

అసలే అది మోడీ సామ్రాజ్యం గుజరాత్ అది. పైగా స్త్రీల మరుగు దొడ్డి లోకి దూరిన కాంగ్రెస్ యువరాజు, అనుక్షణం భారత ప్రధాని నరెంద్ర మోదీ మీద విరుచుకు పడుతూ హస్యోక్తులు, చలోక్తులు రువ్వుతూ పైపట్టు సాధించాలని ప్రయత్నించే వ్యక్తి. దొరికింది కదా ఒక చాన్స్ - అంతే - దీంతో క్షణాల్లో వ్యవహారం సోషల్ మీడియా లో వైరల్ అయింది. రాహుల్ మీద పుంఖాను పుంఖాలుగా సెటైర్లు పేలాయి. ఆయన పొరబాటు గురించి, నెటిజన్లు వరుస జోకులు పేలుస్తూనే ఉన్నారు. ఈ పొరపాట్లు, గ్రహపాట్లు క్రమంగా అలవాట్లై పోయాయి రాహుల్ విషయం లో. రాహుల్ వస్తున్నాడంటే హాస్యానికి మహోత్సవమే అనేలాగా తయారైంది.

అంతర్జాల వేదికగా తాను ప్రత్యర్థుల మీదికి సంధించే విమర్శనాస్త్రాలు ప్రత్యర్ధిని ఇరకాటం లో పెట్టాల్సిన సందర్భం అద్భుత మనిపించే తరుణాన్ని తనకు తానే వెకిలి చేష్టలతో  తుస్సు మనిపించటం రాహుల్ బాబు బాగా అలవాటైంది. ప్రతిసారీ తాను ఆన్-లైన్ వెటకారాలకు దారుణంగా బలి అవటం తొలినుండీ జరగటం తెలిసినా తన దేహంపై, మనసుపై, పరిసరాలపై అవగాహన కోల్పోవటమనేది 'భవిష్య భావి భారత ప్రధాని కావాలి!' అని బలంగా కోరుకునే వ్యక్తి రాహుల్ కు తగని విషయమే. ఈ విషయం ఆయనకు తెలియనిది ఏమాత్రమూ కాదు. 
Image result for rahul gandhi ladies toilet


ఎందుకంటే, గతంలో కూడా పలు సందర్భాల్లో పలు ప్రాంతాల్లో ఆయన  "నోరు జారి అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడడం" అవి సోషల్ మీడియాలో అవి వైరల్ కావడం - రాహుల్ అమాయకత్వం, అవగాహన లేమి, ఆలోచన లేని తనం గురించి అ నేక హాస్యోక్తులు బాంబుల్లా పేలడం అతి సాధారణంగా జరిగేదే. ఇలాంటి అనుభవాలు రాహుల్ కు పుష్కలంగా ఉన్నాయి. అయినా ఆయన వైపు నుంచి మరో పొరబాటు దొర్లిపోయింది. దొర్లుతూనే ఉంటుంది. అదే  "భారతీయ జనతా పార్టీకి అ దైవం రాహుల్ రూపంలో ఇచ్చిన వరం"

అటు భాజపా నాయకులు తన సొంత నియోజకవర్గం అమేథీలో పర్యటించి, తనను ఓడించాల్సిందిగా తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంటే, నరెంద్ర మోదీ జన్మభూమి గుజరాత్ రాష్ట్రంలో రాహుల్ పర్యటించారు. చోటా ఉదయపూర్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ టాయిలెట్ కు వెళ్లాల్సి వచ్చేసరికి రాహుల్ కు ఇబ్బంది ఎదురైంది. టాయిలెట్ల బయట గుజరాతీ భాషలో రాసి ఉన్న బోర్డులను  చదివి అర్థం చేసుకోవడంలో ఆయన తికమక పడ్డారు. బోర్డులతో పాటు మగ- ఆడ బొమ్మలు అక్కడ ఉన్నాయో? లేవో? గానీ- రాహుల్ పరిసరాలపై కూడా అవగాహన లేమితో ఆలోచన కూడా లేకుండా చక్కగా "లేడీస్ టాయిలెట్" లోకి దూరేశారు. గుజరాతీ లో రాసినా అర్ధమౌతుంది. దాదాపు మహిళలు అని ఉన్న అక్షరాలు హిందీ అక్షరాల్లాగే ఉంటాయి.

Image result for rahul gandhi ladies toilet


ఆయన వెంట అక్కడి దాకా వెళ్లిన పార్టీ కార్యకర్తలు అభిమానులు బయటినుంచి కేకలు పెట్టేలోగా, జరగరాని పొరబాటు జరిగి పోయింది. ఆయన గ్రహించి వెలుపలికి వచ్చేశారు, కానీ అప్పటికే "సోషల్ మీడియా హాస్య సమరానికి వేదిక" అయిపోయింది. ఈ మాత్రం వ్యవధి చాలు కదా! రాహుల్ కష్టపడి చేసిన ప్రచారంలో ఏ కొంత మంచి - ప్రయోజనం ఉన్నా దాన్ని కూడా "ఈ పిచ్చి చేష్ట  మాయలా కమ్మేస్తుంది".

రాహుల్ అనగానే ఒక జోకర్ తప్ప నాయకుడు గుర్తుకు రాని రోజులు దాపురించాయి. రాహుల్ చేసిన పొరబాటు ఇప్పుడు ఇంటర్నెట్ అంతా వైరల్ అవుతోంది. అరుదుగా జరిగినప్పుడు ఇలాంటి పొరబాట్లు సరదా గానే ఉంటాయి గానీ, అదే పరంపర గా పొరబాట్లు జరుగుతూ ఉంటే, ఆ నాయకుడి "ఇమేజ్ డ్యమేజ్" అయినట్లే. ఈ విశాల భారతాన్ని పాలించటానికి ఆయన అర్హుడని ఋజువు చేసుకోలేనప్పుడు! కాంగ్రేస్ రాజకీయ చితిమంటల్లో దహనమవక తప్పదు కాదంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి: