ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం భారీ ఎత్తున చేపడుతున్నారు  అధికారపార్టీ జనాలు. అధికారం తమదే అవ్వడం తో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గురించి జనాలలో ఈ రకంగా ప్రచారం చేసే ప్రోగ్రాం పెట్టుకుంది ఈ పార్టీ. వచ్చే ఎన్నికలకి అప్పుడే లక్ష్యం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతోంది టీడీపీ.

తెలంగాణా లో కూడా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం మొదలు పెట్టాలి అనేది చంద్రబాబు ఐడియా. అయితే ఏపీ లో లాగా కాకుండా తెలంగాణా ప్రాంతం లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ. అందుకే ఇక్కడ పథకాల గురించి చెప్పకూడదు, పథకాల లో లోటు పాట్లు గురించి చెప్పాలి. కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విధానాల మీద పోరాటం సాగించడం కోసం ప్రణాళిక ఇప్పటికే టీటీడీపీ సిద్ధం చేసుకుంది.

దీనికోసం రాష్ట్ర కమిటీ మొట్ట మొదటి సారి సమావేశం కూడా అయ్యింది. అంతా బాగానే ఉంది కానీ టీటీడీపీ లో ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలి అంటే మొదట అడ్డు వచ్చేది లోలోపల జరుగుతున్న తగాదాలు. విభేదాలు బయటకి కనపడకుండా ఇలాంటి పరిస్థితి లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చిత్తశుద్ధి తో చెయ్యడం టీడీపీ జనాలకి పెద్ద సవాల్ గా మారింది.

పొత్తుల విషయం లో ఎలాంటి స్ప‌ష్ట‌తా ఇవ్వ‌లేదు. ఇంకోప‌క్క ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం అంటూ ఇంటింటికీ కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లిన‌ప్పుడు తెరాస‌పై విమ‌ర్శ‌లు చెయ్యొచ్చా, కాంగ్రెస్ తీరుపై మండిప‌డొచ్చా, భాజ‌పా విధానాల‌ను త‌ప్పుబ‌ట్టొచ్చా.. ఇలాంటి సందిగ్ద‌త కొంతమందిలో ఉండ‌నే ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: