మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సర్వే పిచ్చోళ్ళు, సర్వే విషయం లో చాలా నిక్కచ్చిగా ఉంటారు వారు. వివిధ రాజకీయ సంస్థలు ఏం అనుకుంటున్నాయి రాజకీయ పర్వం లో తమ పరిస్థితి ఎందాకా వచ్చింది, తమ గెలుపు గురించి ఎంతమంది కాంక్షిస్తూ ఉన్నారు అనేది తెరాస , టీడీపీ అధినాయకుల మనసులో ఎప్పుడూ మెదిలే ప్రశ్న.

అందుకే ఎప్పటికప్పుడు సర్వే లు అంటూ హడావిడి చేస్తూ ఉంటారు వారు. ఇవన్నీ పక్కన పెట్టి , అంటే సొంత సర్వే లు పక్కన పెట్టి ఏ ఛానల్ వారు ఏది చెప్పినా కూడా వారు కీలక ప్రాంతాలలో ఎలాంటి సర్వే చేసారు రిజల్ట్ ఎలా ఉంది, ఎవరికి అనుకూలంగా ఉంది, సర్వే చేసిన విధానం ఏంటి ఇలాంటివి పర్సనల్ గా తెప్పించుకుంటూ ఉంటారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.

వీరిద్దరి సంగతీ పక్కన పెడితే ఈ సర్వే పిచ్చి జగన్ మోహన్ రెడ్డి నుంచి కాంగ్రెస్ వరకూ అందరికీ అంటుకుంది. రీసెంట్ గా వైకాపా లోకి సలహాదారు గా వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మేధావుల దగ్గర నుంచీ వ్యాపారవేత్తల వరకూ వైకాపా మీద అభిప్రాయాలు సేకరిస్తూ వస్తున్నారు. పార్టీ పనిలో లేదా జగన్‌ శైలిలో ఏం మార్పులు కోరుకుంటున్నారని వారు ప్రశ్నలు వేస్తన్నారు.

కాంగ్రెస్‌ నాయకులు ముఖ్యంగా తెలంగాణలో వ్యక్తిగతంగా తమ తమ సర్వే నివేదికలు తెప్పిస్తున్నారు. మరొక పక్క ఆరెస్సెస్ కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వే చేస్తోందట. మోడీ ప్రభుత్వం , మోడీ పాలన విషయం లో జనాలు ఎలాంటి అభిప్రాయం లో ఉన్నారు అనేది తెలుసుకోవడం వారి ఐడియా. ఇలా దేశం మొత్తం సర్వే పిచ్చోళ్ళ తో నిండిపోయింది మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: