తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరికీ ఒకరి అనుభవం మరొకరికి తోడు అయ్యి, సలహాగా ఉపయోగపడుతూ వస్తోంది. ఒక చోట టీడీపీ తప్పు చేస్తే మరొక పక్క తెరాస తప్పు చెయ్యడం దాంట్లోంచి ఇద్దరూ నేర్చుకోవడం పరిపాటిగా మారింది. నంద్యాల ఉప ఎన్నిక ని చూసి నల్గొండ కి సిద్దం అవుతున్నారు కెసిఆర్, అలాగే రీసెంట్ గా తెరాస కి ఎదురైనా చేదు అనుభవం చూసి టీడీపీ ఏపీ లో జాగ్రత్త పడుతోంది.

బీసీ లకి చంద్రన్న పెళ్లి కానుక ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. క్యాబినెట్ సమావేశం లో యావత్ క్యాబినెట్ ఈ పథకానికి ఆమోద ముద్ర కూడా వేసింది. ఈ చంద్రన్న కానుక అంశం క్యాబినెట్ భేటీ కి వచ్చే ముందర శాఖాపరంగా చాలా పెద్ద చర్చ కి దారి తీసింది అని సమాచారం. మొదటగా చేసిన ప్లాన్ ప్రక్రారం ఈ చంద్రన్న కానుక లో పాతిక వేలు నగదు ఇచ్చి ఐదు వేల తో చీర ఇతర దుస్తులూ కొంటారు.

ఇదే ప్రతిపాదన మంత్రి అచ్చెన్నాయుడు ముందరకి రాగా ఆయన ససేమిరా అన్నారట. ఎందుకంటే, దుస్తులు కొనుగోలు చేసి పంపిణీ చేస్తే.. ఎక్క‌డైనా ఏవైనా లోపాలు దొర్లితే తెలంగాణ‌లో తెరాసకు ఎదురైన అనుభ‌వ‌మే మ‌న‌మూ ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని చెప్పార‌ట‌.

ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రో విమ‌ర్శ‌నాస్త్రం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌న్నార‌ట‌.  బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమం లో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే కదా సో ఇలాంటి టైం లో చీరలు లాంటి ప్రోగ్రాం పెట్టకుండా ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నారట ఏపీ మంత్రులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: