ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. ముందస్తు ఎన్నికల జపం మొదలవడంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. మరోవైపు టికెట్ల ఆశావహులు కూడా జోరుగానే తెరవెనుక మంత్రాంగాలు మొదలుపెట్టారు. ఇప్పటికే కొంతమంది టికెట్లు కన్ఫమ్ చేసుకున్నారు. అలా టికెట్ ఓకే అనిపించుకున్నవారిలో అనంతపురం ఎంపీ అభ్యర్థి కూడా ఉన్నారు. ఇంతకూ ఆ అభ్యర్థి ఎవరో తెలుసుకోవాలని ఉందా..?

Image result for jc diwakar reddy

          అనంతపురం పార్లమెంటుకు ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. తాడిపత్రి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి అత్యధిక సార్లు గెలిచిన చరిత్ర జేసీ దివాకర్ రెడ్డికి ఉంది. అయితే 2014 ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన .. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తాడిపత్రి నుంచి సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా వీరికి టికెట్లు ఇవ్వకపోవడానికి చంద్రబాబు వద్ద కారణాం లేవు. అయితే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం పోటీ చేయడం లేదు.

Image result for jc diwakar reddy

          జేసీ దివాకర్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలాకాలంగా చెప్తూ వస్తున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని.., ఈసారి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చారు. అయితే జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేయకపోతే ఆ స్థానం ఎవరికి దక్కుతుందా.. అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ.. దివాకర్ రెడ్డి స్థానం ఆయన కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి దక్కబోతున్నట్టు టీడీపీ వర్గాల సమాచారం.

Image result for jc diwakar reddy

          టీడీపీ నుంచి ఈసారి జేసీ దివాకర్ రెడ్డి బదులు జేసీ పవన్ కుమార్ రెడ్డి బరిలో దిగనున్నారు. ఈ మేరకు అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. పవన్ కుమార్ రెడ్డి కూడా ఈ మేరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఆ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన సొంత ఆఫీసులను ఓపెన్ చేసి ప్రజలతో నిత్యం టచ్ లో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గతేడాది అనంతపురంలో పెద్ద ఎత్తున ఒలంపిక్ రన్ నిర్వహించారు. పేదలకు పెళ్లిళ్లు చేశారు.

Related image

          కుటుంబ వారసత్వం, జేసీ కుటుంబ చరిష్మాతో పాటు ఆర్థికంగా బలంగా ఉండడం.. లాంటివన్నీ జేసీ పవన్ కుమార్ రెడ్డికి ప్లస్ పాయింట్స్. అంతేకాక.. పవన్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ప్రజలతో నిత్యం టచ్ లో ఉండడంతో పాటు వ్యక్తిగతంగా కేడర్ ఉండడం వారికి కలిసొస్తుందని భావిస్తున్నారు. మరి చూద్దాం.. పవన్ కుమార్ రెడ్డి ఏ మేరకు రాణిస్తారో..!


మరింత సమాచారం తెలుసుకోండి: