సాధారణంగా పక్షులు, జంతువులు వాటి ఆహార సేకరణ చాలా విచిత్రంగా ఉంటుంది.  ముఖ్యంగా అడవిలో కొన్ని రకాల జీవరాశులు అవి తినేందుకు సేకరించే ఆహార పదార్ధాలు ఎంతో చాక చౌక్యంగా సేకరిస్తుంటాయి.  ఇక కృర మృగాల విషయానికి వస్తే..వేటాడి చంపడం వాటి నైజం.  కానీ సాదు జంతువులు మాత్రం అడవిలో లభించిన ఆకులు, అలములు తిని జీవిస్తుంటాయి.  కొన్ని పక్షులు పండ్లూ చిన్న చిన్న ప్రాణులను చంపి తింటుంటాయి.  అయితే మనం చిన్నప్పుడు కాకి కథ వినే ఉంటాం..అది ఓ కుండలో అడుగు భాగాన ఉన్న నీటిని పైకి తీసుకు రావడానికి ఒక్కో రాయి ఆ కుండలో వేస్తుంది.

అప్పుడు ఆ కుండలో ఉన్న నీరు పైకి రావడం..తన దప్పిక తీర్చుకోవడం జరుగుతుంది. ఇలాంటి తెలివి జపాన్ కాకులకు కూసింత ఎక్కువే ఉన్నట్లుంది. బాగా ఆకలితో ఉన్న ఈ కాకికి ఓ కాయ దొరికింది. దాన్ని పగలగొట్టి లోపలున్న గింజ తినాలి.  కానీ అది ఎలా పగులగొట్టాలో దానికి తెలియదు..ఇంతలో ఓ ఉపాయం ఆలోచించి..రద్దీగా తిరుగుతున్న వాహనాల ముందు వేసింది. ఇంకేముంది టైర్ కింద పడి ఆ గింజ పగలిపోయింది. 

దాన్ని అతి కష్టం మీద తిన్నది..అయితే వాహనాల రద్దీతో ఆ గింజ నుజ్జు నుజ్జు కావడంతో మరో తెలివి చేసి ట్రాఫిక్ సిగ్నల్ ప్రకారం కాయవిడిచి వాహనాల రద్దీ తగ్గాక తన ఆహారం తనడం ఓ వీడియో తీశారు.  ఈ కాకి ప్రదర్శించిన తెలివికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు. దాన్ని మెచ్చుకుంటూ ఆ వీడియోను తన ట్విటర్ ఖాతలో పోస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: