కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి నేడోరేపో పట్టాభిషేకం అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే యువరాజు రాజైతే ఎలా ఉంటుందోననే ఆందోళన ఆ పార్టీ వర్గాలను తీవ్రంగా కలచివేస్తోంది. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇంతటి దుస్థితి ఎప్పుడూ లేదు. మరి ఇకముందు ఎలా ఉంటుందోననే భయం ఆ పార్టీ లీడర్లను వెంటాడుతోంది.

Image result for rahul gandhi

రాహుల్ గాంధీ టైం అస్సలు బాలేదు.. ఆయన ఏం చేసినా రివర్స్ అవుతోంది. 2014తో పాటు ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేసిన చోట అపజయాలే ఎదురయ్యాయి. అసలు రాహుల్ రాకుంటేనే బాగుంటుందని ఆ పార్టీ నేతలు మొక్కుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఆయన తెలిసో తెలియకో చేసిన మిస్టేక్స్ ... రాహుల్ ను ఈజీగా బుక్ చేసేస్తుంటాయ్. ఇటీవల.. గాంధీ, నెహ్రూలంతా ఎన్నారైలే అని పెద్ద దుమారమే లేపారు. తాజాగా.. మహిళల స్కర్టులపై మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నారు. నిన్న మహిళల టాయిలెట్ లోకి వెళ్లి మరోసారి సోషల్ మీడియాకు అడ్డంగా చిక్కిపోయారు.

Image result for rahul gandhi

రాహుల్ గాంధీ మహిళల టాయిలెట్ నుంచి బయటకు వస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. లేడీస్ టాయిలెట్ అని గుజరాతీలో రాసి ఉండటంతో రాహుల్ కి అర్థం కాలేదంటూ ఆయన తరఫున పార్టీ నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బయట బోర్డు సరిగ్గా లేకపోవడంతో రాహుల్ సరిగ్గా అర్థం చేసుకోలేక పోయారని వాదిస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు తప్పు రాహుల్ ది కాదని.. బోర్డు సరిగ్గా పెట్టని మోది ప్రభుత్వానిదే అంటూ ఎదురుదాడికి దిగారు.

Image result for rahul gandhi

తప్పుమీద తప్పులు చేస్తున్న రాహుల్ ను వచ్చే ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థి అని ఊహించుకోవడానికే ప్రజలు వణికిపోతున్నారు. ప్రజల సంగతి పక్కనపెడితే కాంగ్రెస్ పార్టీ నేతలకే అది మింగుడు పడడంలేదు. ఇలాంటి నేత నేతృత్వంలో పార్టీ ఎలా బతికి బయటపడుతుందోనని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందుకే సీనియర్ నేతలంతా తట్టా బుట్టా సర్దేసుకుని వేరు దారి పట్టారు. రాహుల్ మాత్రం తనపని తాను చేసుకుపోతున్నారు.. అంతేకానీ.. పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేయడం లేదు.

Image result for rahul gandhi

సోనియా గాంధీ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు. రాహుల్ గాంధీపై పెద్ద బాధ్యతలు పెట్టారు. కానీ రాహుల్ పరిణితి రాజకీయాలకు సరిపోవడం లేదు. తప్పులు చేయడం కామన్. అయితే ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో రాహుల్ పూర్తిగా విఫలమవుతున్నారు. ఓ వైపు మోదీ తన వ్యూహాలతో దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడిపోతోంది. ఈ పరిస్థితి నుంచి బయటకు రాకపోతే కాంగ్రెస్ మనుగడ మరింత కష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: