అమరుల స్ఫూర్తి యాత్ర కోసం వరంగల్‌ వెళ్తున్న తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో, ఇంటి నుంచి బయటకు రాకుండా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, స్ఫూర్తి యాత్రకు ప్రభుత్వం ఒప్పుకోని పక్షంలో... జేఏసీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు.
Image result for కోదండ రామ్
కాగా,  తెలంగాణలో ఆరో దశ స్ఫూర్తియాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆయన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని జేఏసీ బృందంతో వెళ్లి కలిశారు. నల్గొండ జిల్లాలో స్ఫూర్తియాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
Image result for kodanda ram arrest
తమ యాత్రకు అనుమతి ఇవ్వకుండా జేఏసీ ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మంత్రికి వవరించినట్లు కోదండరాం తెలిపారు. తాజాగా అమరుల స్ఫూర్తి యాత్ర కోసం వరంగల్‌ వెళ్తున్న రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్‌కేసర్‌ జీడిమెట్ల వద్ద ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కీసర పోలీసుస్టేషన్‌కు తరలించారు.  కాగా... ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా, అరెస్టులు చేసినా అమరుల స్ఫూర్తియాత్ర ఆపబోమని విలేకరులతో కోదండరాం అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: