వర్షాల్లో హైదరాబాద్ తడిసి ముద్దవుతున్నా వరుణుడు కరుణించి ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షించలేదు. వాన పడకున్నా ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం రాత్రి జరగాల్సిన టీ-20 మ్యాచ్‌ రద్దు చేయడం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఘోర వైఫల్యమ ని భారతీయ జనతా పార్టీ విమర్శించింది.


కనీస ప్రమాణాలు పాటించక హెచ్‌సీఏ స్వహస్తాల తో ఈ మ్యాచ్‌ ను నీరు గార్చి వేలాది మంది క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆరోపించింది. హెచ్ సీ ఏ పై భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మండి పడ్డారు. నిన్నటి టీ20 మ్యాచ్ నిర్వహణ విషయంలో హెచ్ సీఏ చాలా అసమర్థంగా వ్యవహరించిందని విమర్శించారు. 


.. 


హెచ్‌సీఏ కార్యవర్గంలో ఎవరున్నా కథంతా అక్రమ సంపాదన చుట్టూతా తిరుగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపించారు. వచ్చిన నిధుల్ని వచ్చినట్లే స్వాహా చేస్తుండడం వల్లే ఉప్పల్‌ స్టేడియం లో ఎలాంటి అభివృద్దిలేక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి ఘటనల వల్ల భవిష్యత్తులో ఉప్పల్ స్టేడియం మళ్ళీ అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 

అవినీతిలో సెంచరీలు కొడుతున్న హెచ్‌సీఏ ను తక్షణమే రద్దు చేసి తగిన చర్యలు తీసుకుని బ్రాండ్ హైదరాబాద్‌ను, బ్రాండ్ తెలంగాణను కాపాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీజేపీ కోరుతుందన్నారు.

 

అసలు సంగతేమంటే - నిర్ణయాత్మక టీ-20 మ్యాచ్‌ ఉప్పల్ మైదానం అనుకూలించకపోవటంతో రద్దు కావటంతో అభిమాను లు తీవ్ర నిరాశ చెందారు. అయితే క్రికెట్ అభిమానులను  సంతోషపరచేందుకు టీమిండియా బ్యాట్స్ మెన్లు మాత్రం చేసిన పని మాత్రం పూర్తిగా ఆకట్టుకుంది.


 


టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, హర్దిక్‌ పాండ్యా కలిసి మైదానంలో సరదాగా ప్రాక్టీస్ చేశారు. మాములుగా చేస్తే ఏం కిక్కుంటుందో అనుకున్నారో? ఏమో ఎడమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. సరదాగా ఎడమ చేతి బ్యాటింగ్‌తో కొంత సేపు ప్రేక్షక క్రీడాభిమానులను అలరించారు. ముందు మైదానంలోకి దిగిన రోహిత్ శర్మ కాస్త తడబడి నప్పటికీ, తర్వాత వచ్చిన కోహ్లీ మాత్రం ఫర్వాలేదనిపించాడు.

 

ఇక తర్వాత దిగిన హర్దిక్ బ్యాట్‌ను బాగానే ఝుళిపించాడు. అటుపై వచ్చిన ధోనీ కూడా కష్టపడ్డాడు. మొత్తానికి నలుగురిలో పాండ్యానే అద్భుత ఫెర్‌ ఫార్మెన్స్ ఇచ్చాడన్న మాట. బీసీసీఐ తన అధికార ట్విట్టర్‌ లో ఆ ఫోటోలను పోస్ట్‌ చేసింది. ఇక పాపం కోహ్లీ ఎడమ చేతి వాటంను చూపించేస్తూ.. డీసెంట్‌ ప్రదర్శన అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: