కశ్మీర్‌ విషయంలో ప్రపంచంలోని ఏశక్తి భారత్‌ను ఆపలేవని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి భారత్‌ తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన తెలిపారు. చొరబాట్లకు పాల్పడే ఉగ్రవాదులకు ఏరివేయడం లో కశ్మీర్‌ లోయ లోని సైనికులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోనూ, సరిహద్దు లోనూ ఉగ్రవాదులకు సైన్యం దీటుగా బదులిస్తోందని అన్నారు. కశ్మీర్‌ భద్రత గురించి దేశంలో ఏ ఒక్కరూ సందేహించాల్సిన అవసరం లేదని రాజ్‌నాథ్‌ అన్నారు. 

Image result for rajnath on gujarat gaurav yatra


ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్‌ను అపలేవు. కశ్మీర్‌ సమస్యకు పరిష్కరిస్తాం. అని ఆయన అన్నారు. గుజరాత్‌లో జరిగిన "గుజరాత్‌ గౌరవ యాత్ర" లో ఆయన ప్రసంగిం చారు. పొరుగునున్న పాకిస్తాన్‌తో శాంతిని నెలకొల్పేందుకు మన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విధాలుగా ప్రయత్నించారని ఆయన చెప్పారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మరీ మోదీ పాకిస్తాన్‌ వెళ్లి అక్కడ చర్చలు జరిపారు. అయితే పాకిస్తాన్‌ ఆలోచనల్లో ఎటువంటి మార్పులు రాలేదని చెప్పారు. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యం రెచ్చగొట్టేలా కాల్పులకు దిగుతుంది. మన సైన్యం ఘట్టిగా ఘాటుగా ప్రతిస్పందిస్తే, తెల్లజెండా ఎగరేస్తారని ఎగతాళిగా అన్నారు. భారత్ ను నేడు ప్రపంచం లోని ఏ శక్తీ ఎదిరించి నిలవలేదు. 


Image result for rajnath on gujarat gaurav yatra


ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నాటి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్వేచ్ఛ ఇచ్చివుంటే, నేడు కశ్మీర్‌ సమస్య  అనేదే ఉండేది కాదని రాజ్‌నాథ్‌ మరోసారి చెప్పారు.  పండిట్‌ నెహ్రూ వైఫల్యం వల్లే కశ్మీర్‌ సమస్య ఉత్పన్నమైందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: