ప్రతిపక్ష వైకాపా పార్టీ లేదా జగన్ మోహన్ రెడ్డి ఏదైనా విషయం మీద గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఎక్కడైనా సరైన స్టాండ్ తీసుకున్నప్పుడు, ఒక కొత్త సంచలన నిర్ణయం తీసుకున్నప్పుడు టీడీపీ రియాక్షన్ ఒకటే ఉంటుంది. నిర్ణయం ఏదైనా, అడుగు ఎలాంటిది వేస్తున్నా కూడా టీడీపీ పాయింట్ కేవలం జగన్ మోహన్ రెడ్డి కేసులు లేదా జైలు వ్యవహారం మీదనే ఉంటుంది ప్రోగ్రాం అంతా.


ఇప్పుడు తాజాగా జగన్ పాదయాత్ర మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నవంబర్ 2 నుంచీ జగన్ పాదయాత్ర కి సిద్ధం అవుతున్న నేపధ్యం లో మళ్ళీ టీడీపీ ఉన్న ఒకే ఒక ఆస్త్రం అయిన 'జైలు,కేసులు' ని బయటకి తీసుకొచ్చింది. సీనియర్ మంత్రులు, ఎంతో అనుభవం ఉన్నవారు కూడా ఇదే రకంగా జగన్ ని ఒకటే పాయింట్ మీద టార్గెట్ చేస్తూ ఉండడం విశేషం. ఎంతోసీనియర్‌ అయిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు , హౌం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఏ కేసులో ఏమి తీర్పునిస్తారు, ఎప్పుడు ఇస్తారు అన్నది ఒక సస్పెన్స్‌. కాని మంత్రులు మాత్రం మాటిమాటికి జైలు పాట పాడటానికి ఆధారం ఏమిటి? అతను దాదాపు 16 నెలలు జైల్లో ఉండి బయటకి వచ్చిన తరవాతనే ప్రతిపక్ష నేత అయ్యాడు అనే పాయింట్ వీరంతా ఎలా మర్చిపోతున్నారు అనేది అర్ధం కావడం లేదు.



16 నెలలు జైల్లో ఉండి బయటకొచ్చి దాదాపు 67 స్థానాలు మంచి మెజారిటీ తో గెలుచుకున్నాడు జగన్, ఇది అసలు రాజకీయ చరిత్ర లోనే ఒక చెప్పుకోదగ్గ విజయం.అందులో మూడో వంతు టిడిపిలో చేరినా ఇంకా రెండు వంతులు వున్నారు. తమిళనాడులో జయలలిత లేదా బీహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా కేసులు జైళ్లు ఎదుర్కొంటున్నా జనం గెలిపించారు. జగన్ మీద ఆర్ధిక కేసులు ఉన్నాయి తప్ప మర్డర్ లాంటి కేసులు కూడా లేవు, యనమల లాంటి సీనియర్ లు సైతం జగన్ ని విమర్శించే ఛాన్స్ దొరక్క ఇలా ఏదో ఒకటి అనుకుంటూ కామెంట్లు పెట్టెయ్యడం బాధాకరంగా ఉంటుంది అప్పుడప్పుడూ.


మరింత సమాచారం తెలుసుకోండి: