తెలంగాణా ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణా ఉద్యమసమయంలో తన సహచర ఉద్యమకారుడు తెలంగాణా ప్రజలకు ఆప్తుడైన కోదండరాం ను ప్రభుత్వ పాలనను ప్రశ్నించినందుకు తిట్టిన తిట్టు తిట్టకుండా వాడు వీడు అంటూ అసహ్యకర అసభ్యపద పదజాలం వాడి ఆయన స్థాయిని ప్రజల్లో పలుచన చేసు కున్నారు. గౌరవం స్థాయి పూర్తిగా పడిపోయింది అలాగే ఇప్పుడు హోం శాఖా మాత్యులు నాయని నరసింహారెడ్డి కోదండరాం గారి వెనుక మావోయిస్టులు ఉన్నా రన్నారు. అయితే హోం మంత్రిగా ఉన్న ఆయన కోదండరాం గారు ఆయనపై చర్యలు తీసుకొనే చర్యలు మాని-మాటలు మొదలెట్టటం ఎందుకో? సారుకు మాటలు తప్ప చేతలు తెలియదేమో? అంటున్నారు ప్రజలు. అసలు కథేమిటంటే:   


కోదండరామ్‌ వెనుక మావోయిస్టులు ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. ఆయన కాంగ్రెస్‌కు, మావోయిస్టులకు కొమ్ముకాస్తూ యాత్రలు చేస్తు న్నాడని విమర్శించారు. కోదండరామ్‌ది నిజమైన జేఏసీ కాదని, అసలు జేఏసీ ఎప్పుడో బయటకి వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. 


1969 ఉద్యమకారులే తెలంగాణ ఆవిర్భావానికి కారణమని కొనియాడారు. 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన 'తొలి తెలంగాణం' పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెద్ద మనుషుల ఒప్పందం, నిబంధనలు అమలు కాక పోవడం వలనే తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగిందన్నారు. 


అన్ని వర్గాల నుంచి ఓయూ విద్యార్థుల వరకు సాగిన ఈ ఉద్యమంలో సోషలిస్టు ఉద్యమం నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారని గుర్తు చేశారు. 360 మంది విద్యార్థుల బలిదానం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమరణ దీక్ష ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాధించామని చెప్పారు. రాష్ట్రం సాధించిన వెంటనే 24గంటల విద్యుత్‌, మిషన్‌ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, వేలాది ఉద్యోగాలు కల్పిసూ దేశంలోనే నెంబర్‌ వన్‌ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ పేరు సంపాదించారని కొనియాడారు. 


కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడం తగదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడితే పోలీసులు అరెస్టు చేయకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన తొలి ఉద్యమ కారుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామనీ, వారిపై ఉన్న కేసులన్నీ ఎత్తేస్తామని హామీనిచ్చారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, నాలుగున్నర కోట్ల ప్రజ లందరికీ అవసర మైన సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. 


ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ఇరవైనాలుగున్నర లక్షల టన్నుల నుంచి 94 లక్షల టన్నులకు పంటల ఉత్పత్తిని పెంచుకోగలిగామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్‌ బండారి భాస్కర్‌, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: