ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే ఈ విభాగంలో అత్యధిక జనసాంద్రతగల దేశం భారత్. అంటే అత్యధిక ప్రజలు గల ప్రజాస్వామ్య దేశం. అయితే ఏడు దశాభ్ధాల ప్రజాస్వామ్య పాలనలో ఈ దేశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ మళ్ళీ ఇతర పార్టీల సమాఖ్యలు పరిపాలించాయి. కాంగ్రేస్ కాకుండా పూర్తి ఆధిఖ్యతతో ప్రతిపక్ష పార్టీల ప్రమేయమే లేకుండా 2014 లో భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాల కూటమి "నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్" గా అధికారం అధిష్టించింది.


అయితే తొలిదశలో ప్రధాని నరెంద్ర మోడీ నాయకత్వంలోని బాజపా తన ప్రాభావాన్ని దేశమంతా వ్యాపింపచేసే కార్యక్రమమానికి శ్రీకారం చూట్టారు. ఈయనకు తోడుగా అదే రాష్ట్రానికి చెందిన అమిత్ షా తోడై చాణక్య చంద్ర గుప్తులు అన్నంతగా ద్వంద్వనాయకత్వం నూతనంగా దిశా నిర్దేశం చేస్తూ వచ్చాయి. అయితే కాలక్రమేణా, ప్రేమికులకు తొలిప్రేమ మైకం తొలగిపోయి అసలు జీవితం అర్ధమైనట్లు ప్రజలకు నేడు బాజాపా అనుసరిస్తున్న విధానం అదే ఏకపక్ష నియంతృత్వంగా కనిపించటం మొదలైంది. 


మోడీ అహంభావం తో చేసిన పెద్దనోట్ల రద్ధు భారత సామాన్యుల్ని నడిరోడ్ పై కొన్ని నెల్లలపాటు నిలబెట్టినా ఆశించిన ప్రాయోజనం సిద్ధించలేదు. రఘురాం రాజన్ లాంటి ప్రసిద్ధ వ్యక్తుల సలహాలను పెడచెవిన పెట్టిన నాయకత్వం స్వంత రాజకీయ ప్రయోజానాలకు పరిహసించింది. సరైన ధీటైన ప్రతిపక్షం లేని చోట, బాజపా ప్రభ వెలిగిపోతుంది. ప్రతిపక్షాలన్నీ కాంగ్రేస్ డి ఎన్ ఏ నే కలిగి ఉండటం నాయకులంతా కట్టకొని అవినీతి, బంధుప్రీతితో కుళ్ళి కృశించి పోతుండటం తో ఈ బాజపా వెలుగు జిలుగులు దిగంతాలకు వ్యాపించటం తో సరైన హోంవర్క్ చేయ కుండానే జిఎస్టి ని తెరపైకి తెచ్చి అమలులోకి తేవటం జరిగింది. ఇప్పటికీ ఈ జిఎస్టి అమలులో ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని చార్టర్ ఎకౌంటెంట్ల సమాఖ్యలే చెపుతున్నాయి.


ఈ రెండు ఆవిష్కరణలు సమాజములో అభివృద్ధికి ఊతమిచ్చి జనజీవితం లో అద్భుతమైన పెనుమార్పులు తీసుకొస్తాయనుకుంటే, జాతి దేశం అటు సంఘటితనంగా, ఇటు వ్యక్తిగతంగా ఆర్ధిక తిరోగమనం రుచి చూస్తునాయి.


బాజపా జైత్ర యాత్ర తొలిదశల్లో ఒకసారి ప్రతిపక్షం ధిమ్మదిరిగే దెబ్బ బిహార్, డిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో కొట్టినా మైకంలో ఆ సంకెతాలు ఈ జంట నాయకత్వా నికి తెలియలేదుగాని - వినోద్ ఖన్నా ప్రాతినిధ్యం వహిస్తున్న గురుదాస్-పూర్ నియోజకవర్గం లో ఆయన మరణంతో సంభవించిన ఉప ఎన్నిక ఒక విధంగా బాజపా కంచుకోటపైనే బీటలు వారే బలమైన దెబ్బ కొట్టింది. ఆ కంచుకోట కు సొట్టలు పడ్డాయి అంటే అలా ఇలా కాదు, ఏకంగా రెండు లక్షల ఓట్ల మెజారిటీ తో కాంగ్రేస్ తానే ఊహించని విజయం పొందింది. సరైన నాయకత్వం లేకపోయినా ధీటైన పోరాట పటిమ ప్రదర్శించక పోయినా అక్కడ బిజెపికి భారత సాధారణ జనం దిమ్మ దిరిగి, కళ్ళు బైర్లు కమ్మే దెబ్బ కొట్టారు.


 అంతే కాదు భారత మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ ప్రతిపక్ష కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధికి రాజగురువు గా నియమితు డౌతున్న సందర్భం బాజపాకు, అదీ వారి మరో కంచుకోట మోడీ-షాల స్వరాష్ట్రం గుజరాత్ మరియు హిమాచల ప్రదేశ్ ఎన్నికలకు ముందే అపశకున సంకేతంగా గోచరిస్తుంది.

 

అయితే ఇక్కడ కాంగ్రెస్ ఎలా గెలవగలిగింది?


గురుదాస్‌పూర్‌ ఉపఎన్నికలో కేవలం 56 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 7 నెలలే అయ్యింది కాబట్టి అప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏమీ ఉండదు. ప్రభుత్వం నుంచి ఇప్పుడే మార్పు, అభివృద్ధి ఆశించడం అనేది తొందరపాటే.

“బీజేపీ-అకాలీదళ్” ప్రచారవ్యూహంతో పోల్చి చూస్తే కాంగ్రెస్ చాలా పకడ్బందీ ప్రణాళికతో ఎన్నికకి సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అనారోగ్యంతో అసలు ప్రచారానికే రాలేదు. కానీ కాంగ్రెస్ అలాకాదు, ఏకంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పాటు మంత్రులు మన్‌ప్రీత్ బాదల్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ వంటి నేతలు ప్రచారాన్ని ముందుండి నడిపించారు.

ఏదేమైనా భారతీయ జనతా పార్టీ అహంభావం విడనాడి ప్రజాస్వామ్య పద్దతిలో అనాలోచిత నిర్ణయాలను వదిలేయకపోతే ప్రజలు దీనికి కాంగ్రేస్ కు పట్టించిన గతి పట్టించటానికి 2019 ఎన్నికలే నాంది ప్రస్థావన పలకవచ్చు. 


    


మరింత సమాచారం తెలుసుకోండి: