కాపుల రిజర్వేషన్ అంశం మరొక్కసారి మెయిన్ స్త్రీం మీడియా ముందరకి వచ్చి పడింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చాలా రోజుల గ్యాప్ తరవాత తాజాగా మీడియా ముందరకి రావడం తెలిసిందే. ముద్రగడ అప్పట్లో ఛ‌లో అమ‌రావ‌తి పాద‌యాత్ర చేస్తానంటూ ఆయ‌న హ‌డావుడి చేయ‌డం, కిర్లంపూడిలో ఆయ‌న్ని పోలీసులు గృహ నిర్బంధం చేయ‌డం, అయినా తాను త‌గ్గేది లేద‌ని ప‌ట్టుద‌ల‌కు పోవ‌డం.. ఇవ‌న్నీ చూశాం. గ‌డ‌చిన వారంలో కూడా ముద్ర‌గ‌డ కార్యాచ‌ర‌ణ‌కు దిగే ప్ర‌య‌త్నం చేస్తే పోలీసులు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. 

తన ప్రోగ్రాం లు మొత్తం కొన్నాళ్ళు వాయిదా వేస్తున్నా అని ప్రకటించిన ముద్రగడ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం కి అల్టిమేటం జారీ చెయ్యడం షాకింగ్ గా ఉంది. కొత్త గడువు కింద చంద్రబాబు కీ ఆయన ప్రభుత్వానికీ కాపుల రిజర్వేషన్ విషయం తేల్చాలి అంటూ ఆయన గట్టి సవాల్ విసిరారు. డిసెంబర్ ఆరవ తారీఖు ని ఆఖరి తేదీ గా ఇచ్చారు కూడా. కాపులని బీసీ లలో జేర్చే మాట ఇప్పటి వరకూ నిలబెట్టుకొని చంద్రబాబు ఇప్పటికే మోసం చేసారు అనీ , ఈ సారి చంద్రబాబు కి చుక్కలు చూపించి తీరతాం అనీ సీరియస్ అయ్యారు ముద్రగడ.

అయితే మన వెబ్సైటు కి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం .. జగన్ మోహన్ రెడ్డి - ముద్రగడ లు కలిసే ఈ కొత్త గడువు ఇచ్చారు అని తెలుస్తోంది. జగన్ పాదయాత్ర మొదలైన కొద్ది వారాలకే అంటే నెల రోజులకి ముద్రగడ ఇచ్చిన గడువు అయిపోతుంది. సో ఇద్దరూ కలిసి ఆ టైం లో ప్రభుత్వం మీద సంయుక్తంగా పాదయాత్ర నిర్వహిస్తారు అని ఒక పాయింట్ సోషల్ మీడియా లో డిస్కషన్ గా సాగుతోంది.

కాపు సామాజిక వర్గం ఓట్ల మీద ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్న జగన్ ముద్రగడతో ఈ రకమైన ఐడియా ఇప్పించాడు అని అంటున్నారు. సో డిసెంబర్ ఆరు తరవాత అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే జగన్ - ముద్రగడ ఇద్దరూ కలిసిపోయి చంద్రబాబు కి షాక్ ఇస్తూ కొత్తగా వచ్చే ప్రభుత్వం తమదే అయితే కాపు రిజర్వేషన్ పక్కా అని ప్రకటించే ఛాన్స్ లేకపోలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: