తెలుగుదేశం పార్టీ లో కొందరు సీనియర్ లు , పైగా వారు ఎమ్మెల్యే లు కూడా. వారికి ఎప్పటి నుంచో ఇస్తాం అన్న, దక్కాల్సిన స్థానం దక్కక సతమతం అవుతూ ఉంటారు. వీరంతా అధినేత చంద్రబాబు నాయుడు చేసే పనులు నచ్చకపోయినా ఎప్పటి నుంచో ఉన్న పార్టీ గనుక సైలెంట్ గా ఉండడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి.

పార్టీ పనులు ఎలా ఉన్నా నచ్చినా లేకపోయినా సపోర్ట్ చెయ్యడం, ప్రతిపక్షాలని తిట్టడమే వారికి పనిగా మారింది. అలాంటి వారిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ప్రధానమైన వ్యక్తి అని చెప్పాలి. శాసనసభలో వైసీపీని డి కొనడం లో  బుచ్చయ్య చౌదరి ప్రతాపం అందరూ చూస్తుంటారు.

అయితే మిగిలిన కొంతమందిలా గోరంట్ల కేవలం వైసీపీకే పరిమితం కారు. తన నియోజకవర్గం రాజమండ్రిలోనూ తూర్పుగోదావరి జిల్లాలోనూ ఆయనకు బిజెపితో వైరం వుంటుంది. ఉపాధి హామీ పథకం కి సంబంధించి బీజేపీ నేత సోము వీర్రాజు మాట్లాడిన మాటలు బుచ్చయ్య కి కోపం తెప్పించాయి.

ఇప్పటికే ఈ పథకం అమలుపై వైసీపీ వారు ఫిర్యాదులు చేస్తుంటే మీరు కూడా గొంతు కలుపుతారా అని వీర్రాజుపై మండిపడ్డారు. వారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటే బిజెపి కూడా అదే పద్ధతా అని ఆగ్రహించారు. వైకాపా తప్ప బీజేపీ వారు ప్రభుత్వం చేసే పనులు ఎలా ఉన్నా సైలెంట్ గా ఉండాలి అని అనుకుంటున్నారు కాబోలు బుచ్చయ్య గారు . ఏ పధకం అయినా సరైన విధంగా జనాల్లోకి వెళుతోంది అనేది చూసుకుని అప్పుడు మాట్లాడాలి కానీ సొంత పథకం కదా అని అలా కోప్పడితే ఎట్లా బుచ్చయ్య జీ ? 


మరింత సమాచారం తెలుసుకోండి: