ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టబోతున్న పాదయాత్ర కి సంబంధించి అనేక ప్లాన్ లు వేస్తోంది టీడీపీ. వీలైనంత గా నైతిక స్థైర్యం దెబ్బతినే లా ఆపరేషన్ ఆకర్ష్ ఫేస్ టూ మొదలు పెట్టి వైకాపా నుంచి వీలైనంతమంది ఎమ్మేల్యేలని తమవైపు తిప్పుకోవాలి అనేది టీడీపీ ప్లాన్. అదే పంథా లో తాజాగా బుట్టా రేణుక అధికార పార్టీ లో చేరిపోయారు.

అదే జిల్లా చెందిన మాజీ శాసనసభ సభ్యుడు కొత్త పేట ప్రకాష్ రెడ్ది కూడా టీడీపీ లో వచ్చేసారు. బుట్టా రేణుక ఇంకా టీడీపీ లోకి జేరకుండానే వైకాపా ఆమెని సస్పెండ్ చేసింది. దీంతో ఆమె ఇప్పుడు టీడీపీ మనిషి అయిపోయారు. జగన్ పాదయాత్ర మొదలయ్యి ముగిసే లోగా చాలా మందిని తమవైపు లాక్కోవాలి ఆనేది టీడీపీ వ్యూహం.


వలసలని నిరోధించే ప్రయత్నాలు వైకాపా లో ఏం జరుగుతున్నాయి అంటే శూన్యం  అంటున్నారు వైకపా వారే. జగన్ మోహన్ రెడ్డి అసలు ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యే లూ పార్టీ ని వదిలి వెళ్ళిపోయినా సరే ఏమీ కాదు అనే అభిప్రాయం తో ఉండడం కాస్త ఇబ్బందికర విషయమే. పాత వారు బ‌య‌ట‌కి వెళ్తే కొత్త వారు వ‌స్తార‌నీ అవ‌కాశాలు పెరుగుతాయ‌ని నేత‌లు అంటున్నారు. అంతేకాదు, ఇదే త‌రుణంలో ఇత‌ర పార్టీల నుంచి సీనియ‌ర్ నేత‌ల్ని ఆహ్వానించాల‌నేది వైకాపా వ్యూహంగా తెలుస్తోంది. పార్టీని విడిచి వెళ్దాం అని డిసైడ్ అయిన‌వారిని ప్ర‌త్యేకంగా బుజ్జ‌గించినా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌టం లేదు. 


అందుకే వెళ్ళేవారు  వేల్తారు  వచ్చేవారు వస్తారు అన్నట్టు జగన్ ఫీలింగ్ ఉందట. బుట్టా రేణుక విషయం లో కూడా ఆమె ఎంత చెప్పినా వెళ్ళిపోవడం తో ఎవరికి కావాలి అంటే వారు వెళ్ళవచ్చు అంటూ జగనే ఫీల్ అవుతున్నారు అని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: