అయోధ్యలో సరయు నది ఒడ్డున భారీ రాముడి విగ్రహం ఏర్పాటుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.100 అడుగు ఎత్తులో, రూ. 300 కోట్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. రాముడి విగ్రహ ఏర్పాటుపై ఇప్పటికే గవర్నర్‌ రామ్‌నాయక్‌కు యూపీ పర్యాటకశాఖ ప్రజెంటేషన్‌ ఇచ్చింది.  NGT ( నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ) నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే విగ్రహ నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెడతారట. ఈ భారీ విగ్రహ ప్రతిష్ఠను అత్యంత వైభవంగా నిర్వహించే యోచనలో వున్నట్టు తెలుస్తోంది.   
Image result for రాముడి విగ్రహం
తాజాగా రాముడి విగ్రహం ఏర్పాటుకు  ముస్లింలు కూడా మద్దతిచ్చారు.  భారత దేశంలో హిందూ, ముస్లిం భాయీ భాయీ అన్ని మరోసారి నిరూపించారు.  సరయూ నదీతీరంలో నిర్మించే ఈ రాముడి విగ్రహం.. ప్రపంచ వ్యాప్తంగా యూపీకి కొత్త గుర్తింపు తీసుకువస్తుంది షియా ముస్లింలు పేర్కొన్నారు. అంతేకాక రాముడి విగ్రహ నిర్మాణానికి పది వెండి బాణాలు బహూకరిస్తున్నట్లు యూపా షియా సెంట్రల్‌ బోర్డ్‌ ప్రకటించింది. 
Image result for రాముడి విగ్రహం
అయోధ్య అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, మత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే యోది ఆదిత్యనాథ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆమోదం లభించిన తర్వాతే విగ్రహ ఏర్పాటు పనులను ప్రారంభిస్తామని పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి అవనీశ్‌ అస్వాథి తెలిపారు. ప్రస్తుతం అయోధ్యలో ఉన్న హనుమాన్‌ గర్హి ప్రాంతాన్ని 1739లో నాటి నవాబ్‌ షాజా ఉద్దౌలా హనుమంతుడి విగ్రహ ప్రతిష్ట కోసం కేటాయించిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: