ఎన్టీఆర్‌ జీవితం ఒక తెరచిన పుస్తకం. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై వాస్తవాలకు విరుద్ధంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఆమోదించరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సారిగా స్పందించారు. కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవితాన్ని "లక్ష్మీస్ ఎన్టీఆర్" పేరుతో సంచలనాలకు, వివాదాలకు మారు పేరు అనబడ్ద టాలీవుడ్, బాల్దెవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ వెండితెర పైకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 


తొలి పోస్టర్ చూసి, వర్మ ఈ సినిమా ఇలా తీయకుండా ఉంటే మంచిదని కొందరు, సినిమా సరిగ్గా తీయకుంటే వర్మ తగిన మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందని కొందరు తెలుగు దేశం నేతలు ఒకరి తరవాత ఒకరు వర్మను హెచ్చరించిన విషయం తెలిసిందే. 


వర్మ చిత్రం పై పదే పదే మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుడుతున్న తన పార్తీ నేతలను అతిగా స్పందించవద్దని దానిపై ఒక గంటకు పైగా చర్చించి  ముఖ్య మంత్రి హెచ్చరించారు. నిన్న సాయంత్రం తెలుగు దేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అమరావతిలోని తన నివాసంలో ఆయన సమావేశం నిర్వహించారు. జరిగింది. ఈ సందర్భంగా అనేక విషయాలపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా "లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌" పేరు తో రామ్‌గోపాల్‌వర్మ సినిమా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు నాయకులు.


దీనిపై స్పందించిన చంద్రబాబు, ఎన్టీఆర్‌ ఎవరో? ఆయన జీవితంలో జరిగిన పరిణామాలేమిటో? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, సినిమాపై తెదేపా నేతలెవరూ ఇష్టాను సారంగా మాట్లాడొద్దని ఆ అవసరం మనకు లేదని సూచించారు. వాస్తవంగా జరిగిన ఘటనలకు విరుద్ధంగా చరిత్రను వక్రీకరించి ఎవరు సినిమా తీసినా ప్రజలు హర్షించరని అన్నారు. ప్రజామోదం లేని సినిమాల పట్ల అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


సినిమా, రాజకీయ రంగాలకు నందమూరి చేసిన సేవలను తెలుగు ప్రజలు మరువలేరన్నారు. వైసీపీ నాయకులు కొందరు రామ్‌గోపాల్‌ వర్మను కలవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేస్తూ మాట్లాడారు. వైసీపీ నేతలతో కలిసి రామ్‌గోపాల్‌ వర్మ తీస్తున్న సినిమా గురించి ప్రజలకు కూడా అవగాహన ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు స్పందించాల్సిన అవసరం లేదని సీఎం సూచించారు. కాగా వైసీపీ నేత "లక్ష్మీస్ ఎన్టీఆర్" మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: