టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడ ఢిల్లీలోనే మకాం వేశారు. రేవంత్‌కు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిని ఇచ్చేందుకు కూడ కాంగ్రెస్ పార్టీ సమ్మతించిందనే ప్రచారం జరుగుతుంది. 


మాజీ కేంద్ర మంత్రి కాంగ్రేస్ లో సీనియర్ జైపాల్‌రెడ్డి ఈ వ్యవహరంలో వ్యూహం రచించారనే ప్రచారం కూడ జోరందుకుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధి తో రేవంత్ రెడ్డి భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి రేవంత్ ప్రవేశానికి రంగం సిద్ధం కాగా తెలంగాణలో టిడిపికి అత్యంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. పై రెండు కారణాలు టి-టిడిపి వర్గాలను గందరగోళం లోనికి నెట్టేశాయి. 

 

Image result for revanth reddy rahul gandhi


అయితే కాంగ్రెస్ పార్టీ మూలస్థంబాలన్న కొందరు నేతలు రేవంత్ రెడ్డి టి-టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో ప్రవేసించటాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీపై అత్యంత అవమానకర , అతి తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటాన్ని కొందరు నేతలు తప్పుబడుతున్నారు. అయితే సీనియర్ కాంగ్రెస్ నేత  జైపాల్‌రెడ్డి ఇందులో ప్రధాన పాత్ర వహించి వ్యూహాత్మకంగా చక్రం తిప్పారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.


తెలుగుదేశం పార్టీలో ఇటీవలకాలంలో చోటుచేసుకొన్న పరిణామాలతో టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీవ్రఅసంతృప్తికి గురయ్యారని సమాచారం. 
ఈ పరిణామాలపై టిడిపి అధినేత చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు కూడా చేశారని సమాచారం. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పరిటాల రవి కుమారుని వివాహం పేరుతో కెసిఆర్ చేసిన పర్యటన సందర్భంగా చోటు చేసుకొన్న వినూత్న రాజకీయ పరిణామాలు "వెలమ + కమ్మ వెల్కం - అనే కుల రాజకీయ సంఘట్టన" గా ప్రజల్లో ప్రచారమైన విషయమై రేవంత్‌రెడ్డి పార్టీ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది.

Image result for kcr at anantapur



దీన్ని పురస్కరించుకొని  అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ రెడ్డి మొగ్గు చూపారనే ప్రచారం కూడ సాగుతోంది.దానికి తన బందువైన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వ్యూహాత్మకంగా పనిచేయటం దానికి తగిన విధంగానే రాహుల్ గాంధి స్పందన మాచ్ అయ్యేలా చక్రం తిప్పారని ప్రచారం కూడ సాగుతోంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం వల్ల పార్టీకి మరింత నష్టం వాటిల్లే అవకాశముందని కొందరు నేతలు అధిష్టానానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ను ఎక్కువగా తిట్టిన వ్యక్తి తెలుగుదేశం లో రేవంత్ రెడ్డి మాత్రమే నన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా అధిష్టానానికి కొందరు నేతలు వివరించారంటున్నారు.


అప్పుడే ఫిర్యాదుల పర్వం మొదలవుతుండటంతో అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది. రేవంత్ రెడ్డి  రాజధాని ఢిల్లీలో ఒక తెలుగు న్యూస్ ఛానెల్‌ తో సంభాషించినట్లు సమాచారం. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై త్వరలోనే మరోసారి మీడియా ముందుకు వస్తానని రేవంత్ రెడ్డి చెప్పారని సమాచారం. ఇటీవల పరిటాల రవి తనయుడు శ్రీరామ్ పెళ్లికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించడం, ఆయన్ను స్వాగతించడం, పరిటాల రవి సమాధిపై పూలు చల్లించడం, అంతేకాకుండా టీఆర్‌ఎస్‌తో ఏపీకి చెందిన కొందరు నేతలు అనుబంధం పెంచుకొని కాంట్రాక్టు పనులు తెప్పించు కోవడం ఇవన్నీ తనకు నచ్చలేదని రేవంత్ రెడ్డి అన్నారని సమాచారం. 


Image result for kcr at anantapur

తెలంగాణాలో కుల రాజకీయాలకు శ్రీకారం 



చంద్ర బాబు వద్ద రేవంత్ రెడ్డి ఉంచిన పొత్తు ప్రతిపాదనలు ఆ తరవాత తెలంగాణ టిడిపి తీరుపై రేవంత్ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు ముందు రేవంత్ రెడ్డి మూడు ప్రతిపాదనలుంచారంటున్నారు ఇందులో మొదటిది



1. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం అంతేకాదు గెలవగలిగే 30 స్థానాలను మాత్రమే టీడీపీ తీసుకోవాలి. 


2. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తు వద్దనుకుంటే వామపక్షాలనైనా కలుపుకొనిపోవాలని చంద్రబాబు ఎదుట రేవంత్ ప్రతిపాదన పెట్టారు. 


3. ఈ రెండు కాకపోతే బీజేపీతోనైనా దోస్తీ కట్టాలన్నది రేవంత్ ప్రతిపాదన. 


అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై తెలుగుదేశం పార్టీ నేతలు విభిన్నమైన ప్రకటనలు చేయడంతో గందరగోళం నెలకొంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సీఎం చంద్ర బాబు భేటీ కానున్నారు. అనంతరం ఢిల్లీ ఎయిర్‌పోర్టు లోనే సీఎంను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న ప్రచారంపై బాబుకు స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.అయితే ఈ ప్రచారంపై రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తేనే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.


Image result for kcr at anantapur


టి-టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి సంప్రదింపులు జరిపారని, మంగళ వారం ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారని, రేవంత్‌ రెడ్డి తో పాటు మరో ఎమ్మెల్యే, 20 మందికిపైగా నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపిన రేవంత్ రెడ్డి రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై మీడియా ప్రతినిధులు రేవంత్‌ను ప్రశ్నించగా, ఏ విధంగానూ స్పందించ కుండా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆయన వెళ్లిపోయారు. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారా! లేదా అన్న దానిపై మరింత ఉత్కంఠ నెలకొంది.


ఒకవేళ రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం నిజమైతే, టీడీపీకి తెలంగాణాలో ఎదురుదెబ్బ తగలడం మాత్రమే కాదు టి-టీడీపీ  సంపూర్ణ భూస్థాపితం అయ్యే అవకాశాలున్నాయని అంటు న్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నవంబర్‌ రెండో వారంలో తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆ నెల 9న గానీ లేదా 12న గానీ వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే భారీ బహి రంగ సభలోనే రేవంత్‌రెడ్డి, ఇతర టీ-టీడీపీ నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 


Image result for jayapal reddy political strategy in telangana

మరింత సమాచారం తెలుసుకోండి: