సార్వత్రిక ఎన్నికలై మూడున్నర సంవత్సరాలైన తరవాత మాత్రమే నారా చన్ ద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ది ఎంపి బుట్టా రేణుక కి కనిపించడంతో ఆమెలో రాజకీయంగా గణనీయమైన మార్పు వచ్చిందని, తాను స్వతహాగా ఒక ఎంట్రెప్రీన్యూర్ నని తనకు తన వ్యాపారాల ద్వార వచ్చే సంపద చాలని ప్రజాసేవే తన పరమార్ధ మని రాజకీయాల్లోకి వచ్చినట్లు సవినయంగా ఆమె విన్నవించుకున్నారు. అది వైసిపి లో కాక అధికారం లో ఉన్న తెలుగుదేశం లో మాత్రమే సాధ్యమని చెప్పారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి తాను మద్దతిస్తున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రకటించారు. తెలుగుదేశంపార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులు, అనుచరులతో ఆమె వచ్చారు. సీఎంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తాను టీడీపీలో చేరు తున్నట్లు రేణుక అధికారికంగా చెప్పలేదు. తాను ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు మాత్రమే చెప్పారు. 


Image result for butta renuka

బుట్టా రేణుక నాడు

బుట్టా రేణుక ఆమె అనుచరులు మాత్రం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తనకు అభివృద్ధి ఇష్టమని, అదే లక్ష్యం తో ఎంపీగా పని చేస్తు న్నానని రేణుక తెలిపారు. "విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా ఎంతో దెబ్బ తింది. ఇంత కష్టాల్లో కూడా రాష్ట్రాన్ని చంద్రబాబు చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. నదుల అను సంధానం పై దేశమంతా మాటలు చెబుతుంటే మీ ముఖ్యమంత్రి ఆచరణలో చేసి చూపించారని మహారాష్ట్ర ఎంపీలు నాతో అన్నారు.


అలాగే వ్యాపార అనుకూల ధోరణుల్లో ఎంతో కాలంగా ముందున్న గుజరాత్‌ను దాటి ఏపీని మొదటి స్ధానంలో నిలపడంపై కూడా ఇతర రాష్ట్రాల ఎంపీల్లో ఎంతో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అందుకే ఆయనకు సహకరించడానికి వచ్చాను. ఈ ప్రభుత్వానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని సీఎం హామీ ఇచ్చారు’ అని చెప్పారు. 


ఈ కార్యక్రమంలో ఆమె భర్త  బుట్టా నీలకంఠం, తదితరులు పాల్గొన్నారు. కాగా, 2019లో జరిగే ఎన్నికల్లో తాను టీడీపీ తరపునే కర్నూలు ఎంపీగా పోటీచేస్తానని రేణుక తెలిపారు. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత ఆమె విడిగా విలేకరులతో మాట్లాడారు. "వైసీపీ నుంచి నన్ను సస్పెండ్‌ చేశారని ఇప్పుడే తెలిసింది. ఎందుకు చేశారో తెలియదు. నేను టీడీపీలో చేరడం లేదు. ఆ పార్టీ ప్రభుత్వానికి అభివృద్ధి కోణంలో మద్దతు ఇస్తున్నాను" అని ఆమె చాలా రాజకీయం తో కూడిన అమాయకత్వాన్ని ప్రదర్శించారు. 


Image result for butta renuka

బుట్టా రేణుక నేడు


ఇలా ఆమె చేయటంలో రెండు పరమార్ధాలు కనిపిస్తున్నాయి. మొదటిది ముఖ్యమైనది ఏమంటే పార్లమెంట్ లో అభిశంసన నుండి తప్పించుకోవటం. రెండవది అతి ముఖ్యమైనది కోరిన పాకేజీ ఇవ్వకుండా అధినేత "చేయి ఇస్తే" ఝలక్ ఇవ్వటానికి ఈ రేణూక గారి "గోడ మీడ పిల్లి ప్రణాళిక" అని కొందరు ప్రతిపక్ష రాజకీయ దురంధరుల వాదన.  బుట్టా రెణుక గారి గోడ మీడ పిల్లి ప్రణాళికే - " తెలుగుదేశం పార్టీలో చేరటం లేదు"  అనే మాట బయటనుండి మద్దతిస్తున్నారట. 

Image result for butta renuka

బుట్టా రేణుక రేపు?

మరింత సమాచారం తెలుసుకోండి: