ఇప్పటికే సంస్కరణల పేరుతో ముక్కు పిండుతున్న డోనాల్డ్ ట్రంప్ భారతీయులకి ఆ దేశం లో అడుగు పెట్టె ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నాడు. అమెరికా వీసాకి సంబంధించి , ఉద్యోగ అవకాశాలకి సంబంధించి , ఆరోగ్య భీమా కి సంబంధించి ఇలా ప్రతీ అంశం లో భారీ మార్పులు చేసారు డోనాల్డ్ ట్రంప్.

తాజాగా వైద్య రంగం లో సంస్కరణ కి తెరతీసారు ఆయన, మందుల ధరలు తగ్గిపోయేలా, ఆకాశం లో ఉన్న ధరలు దిగోచ్చేలా ట్రంప్ ప్లాన్ చేసారు . విదేశాల్లో తక్కువ ధరకు అమ్మే మందులన్నీ అమెరికా లో నిజానికి ఎక్కువ ధరకి అమ్ముతారు. మందుల ధరలు కూడా డ్రగ్ కంపెనీలు డిసైడ్ చేస్తున్నాయి.

దీంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రగ్ కంపెనీల చేతిలో ఇదొక మాఫియాగా మారిపోయింది. అమెరికా ఇచ్చే రాయతీలని వాడుకుని ఇతర దేశాల్లో అన్ని చోట్లా చాలా తక్కువ కి అమ్ముతున్న వారు అమెరికా వచ్చేసరికి మాత్రం ఎక్కువకి అమ్ముతారు. ఇది డోనాల్డ్ ట్రంప్ దృష్టిలో పడింది. తయారు చేసిన సొంత దేశం లో ఎక్కువ కి అమ్మడం ఏంటి అంటూ ఆయన ఈ విషయం మీద ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.

మందుల ధర అనేది ఇక నుంచీ ప్రభుత్వమే నిర్ణయించే విధంగా గట్టి నిర్ణయం తీసుకుంటాం అన్నారు ఆయన. ఇతర దేశాల్లో అమ్మే మందుల ధరలను అమెరికా ప్రభుత్వం కాకుండా డ్రగ్ కంపెనీలు నిర్ణయిస్తున్నాయని, ఈ విధానం మారాలని వైట్ హౌస్ లో కేబినెట్ సహచరులతో మాట్లాడుతూ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తమ మందులను అమెరికాలో మార్కెట్ చేసుకునే భారత్ లోని డ్రగ్ కంపెనీలకు కష్టకాలం మొదలౌతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.  ఇక్కడ నుంచి ఎక్స్ పోర్ట్ అయ్యే మందుల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: