డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దగ్గర నుంచీ మోడీ, మమత బెనర్జీ ఇలా చాలా మందిని కలిసారు కమల్ హాసన్. రాజకీయాల్లోకి రావడం కోసం ఆయన ఈ ప్రయత్నాలు అన్నీ చేసారు. బీజేపీ కి కమల్ మద్దతు పలికేటట్టు ఉన్నాడు అంటూ చాలా మంది లెక్కలు కూడా వేసారు. కమలహాసన్ సైతం ఎక్కడ అబ్బే అలాంటిది ఏమీ లేదు అంటూ అనలేదు.

సో కమల్ - బీజేపీ రానున్న ఎన్నికల్లో పొత్తు ఖాయం అనుకున్నారు. ఇంకా బెటర్ అయితే కమల్ బీజేపీ ని తమిళనాట నడిపించే ఛాన్స్ ఉంది అని కూడా అనుకున్నారు చాలామంది. అయితే రీసెంట్ గా కమల్ హాసన్ మీడియా కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ షాక్ ఇస్తోంది . పెద్ద నోట్ల రద్దు విషయం లో ఒకప్పుడు కమల్ ఆ నోట్ల రద్దు సమర్దిస్త్తూ మాట్లాడాడు,దీని వ‌ల్ల దేశానికి ప్ర‌యోజ‌న‌మే అని తాను భావిస్తూన్నాన‌న్నాడు.

ఇప్పుడు ఇదే విష‌యం మీద క‌మ‌ల్ తాజా ఇంట‌ర్వ్యూలో లెంప‌లేసుకున్నాడు. నోట్ల‌ర‌ద్దు వ‌ల్ల ధ‌న‌వంతుల‌కు, కొంద‌రు నేత‌ల‌కు మాత్ర‌మే ఉప‌యోగం క‌లిగింద‌న్నాడు. తాను కంగారు పడి ఈ కాన్సెప్ట్ ని ఓకే చేసేసాను అనీ ఇది తనకి నచ్చని విషయం అనీ తాను లేటు గా రియలైజ్ అయ్యాను అనీ చెప్పుకొచ్చాడు కమల్.

అయితే పెద్ద‌గా చ‌ర్చ‌నీయాంశంగా లేని రోజుల్లో నోట్ల‌ర‌ద్దు గురించి క‌మ‌ల్ మాట్లాడ‌డం, దీనిని సాకుగా చూపి మోడీని విమ‌ర్శించ‌డం వెనుక మ‌రేదో ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సందేహిస్తున్నారు. పురుఛ్చ‌త‌లైవి జ‌య మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ రాజ‌కీయాల్ని గుప్పిట ప‌ట్టాల‌నుకుంటున్న భాజాపా … క‌మ‌ల్‌ల బంధం పురిట్లోనే సంధి కొట్టిన‌ట్టడం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉండొచ్చున‌ని ఊహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: