రేవంత్ రెడ్డి కథ ఎప్పుడు మీడియా లో వస్తే అప్పుడు రాజకీయ కదలికలు అన్నీ నెమ్మదిగా ఓటుకు నోటు మీద కి వస్తాయి. అందరూ ఇప్పుడు నెమ్మదిగా ఓటుకు నోటు సంగతి ఏమైంది ? అంటూ ఆరాలు మొదలు పెట్టారు.

ఇప్పటికి అయితే ఆ కేసు మూత పడిపోయింది. చంద్రబాబు హైదరాబాద్ నుంచి అంతా సర్దుకుని , తెరాస హైదరాబాద్ లో ఏక చట్రాదిపత్యం మొదలుపెట్టిన తరవాత ఈ ప్రోగ్రాం క్లోజ్ అయిపొయింది. రేవంత్ మీద కోపం తో దీన్ని బయటకి తీయాలని తెరాస చాలాసార్లు చూసినా చంద్రబాబు పేరు వివాదం అవుతుంది అని సైలెంట్ అయిపోయింది.

పోనీ రేవెంత్ ఒక్కడినీ ఇరికిద్దాం అనుకుంటే, అప్రూవర్ అయిపోయిన రేవంత్ రెడ్డి ఏదైనా లీక్ చెయ్యచ్చు. అది ఇంకా పెద్ద ప్రమాదం. స్వభావాన్ని బట్టి అప్రూవర్‌గా మారే అవకాశం వుండదు గాని అందరూ కలసి తనను బలిచేశారనే కోపం ఏమైనా చేయించొచ్చు.

ఈ అంచనాలన్నీ వున్నాయి గనుకే చంద్రబాబు నాయుడు దీనిపై ఏమీ మాట్లాడకుండా కాలక్షేపం చేస్తున్నారు. రేవంత్‌ను ఏమీ అనకుండానే కెసిఆర్‌ను మంచి చేసుకున్నారు. సో ఈ కేసు విషయం లో తెరాస ఎలాంటి నిర్ణయం తీసుకోదు అనేది రేవంత్ రెడ్డి ధైర్యం అందుకే తెరాస కి ఎంత వ్యతిరేకంగా మారినా ఎవ్వరూ తనను ఏమీ చెయ్యలేరు అని రేవంత్ గట్టిగా ఫిక్స్ అయినట్లుగా  తెలుస్తోంది. ఇదంతా ఒక చైన్ లాగా సాగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: