విశ్వవ్యాప్త గౌరవం భారత సమాజం దక్కించుకుంటుంది. భారతీయ సంస్కృతిలో సాంప్రదాయం లో పెరిగిన భారతీయ యువత బ్రిటిష్ సమాజానికి నిరుపమానమైన సేవలు అందిస్తున్నందుకు భారతీయులకు బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరిసా మే తన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ గొప్ప దేశంగా మన్ననలు అందుకోవడంలో భారతీయు లు ఉజ్వలమైన సహకారం అందించటమే కాకుండా కొందరికి ఉదాహరణగా ఆమె కొనియాడారు.


Image result for theresa may


దివ్వెల పండుగ దీపావళి సందర్భంగా బ్రిటన్‌లోని భారతీయులందరకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రత్యేక శుభాకాంక్షల సందేశాన్ని అందించారు. "చెడుపై మంచి, నిరాశపై ఆశ, చీకటిపై వెలుగు విజయం సాధిస్తుందన్న దివ్వెల పండుగ సందేశం" భారత విశ్వాసం తమ ప్రజల్లోను ప్రతిఫలిస్తుందని ఆమె పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా ఈ సందర్భంలో మొత్తం బ్రిటన్ దేశం తరుఫున మీకు కృతఙ్జతలు చెప్తున్నానన్నారు.


యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లోని ప్రతి జీవత రంగంలోనూ మీరు విశేషమైన సేవలు అందించారు' అని డౌనింగ్‌ స్ట్రీట్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. బ్రిగ్జిట్‌ చర్చల కోసం థెరిసా మే ప్రస్తుతం బ్రసెల్స్‌లో ఉండటంతో భారత సంతతి తొలి బ్రిటన్‌ కేబినెట్‌ మినిస్టర్‌ ప్రీతి పటేల్‌ ఆధ్వర్యంలో డౌనింగ్‌ స్ట్రీట్‌లో గతవారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె పాల్గొనలేదు. అందుకుగాను మీడియా ద్వారా ఆమె భారతీయుల సేవలను ప్రస్తుతించారు.


U.S. Secretary of State Rex Tillerson speaks to members of the media at the State Department October 13, 2017 in Washington, DC.



ఈ రోజే "అమెరికాకు భారత్‌ అత్యంత విశస్వసనీయ భాగస్వామి" అని అమెరికా "సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్" రెక్స్‌ టిల్లర్సన్‌ బుధవారం స్పష్టం చేశారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు నడుస్తాయని ఆయన ప్రకటించారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా-భారత్‌లు, వందేళ్ల భవిష్యత్‌ కోసం కలసి ముందుకు సాగుతాయని చెప్పారు. కొంత కాలంగా భారత్‌తో ప్రజాస్వామ్య బంధం బలపడుతోందని చెప్పారు. ఇది స్నేహ బంధం మరింద ధృఢత్వం సంతరించు కోవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ లో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం భారత్‌తో కలిసి అమెరికా పనిచేస్తుందని చెప్పారు. 


ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌ తో కలిసి పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. ఆర్థిక, వాణిజ్య పరంగానూ అమెరికా-భారత్‌ మధ్య సంబంధాలు అవసర మని ఆయన చెప్పారు. గతంలోనూ, ఇప్పుడు భారత్‌ పలు ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేసిందని కితాబిచ్చారు.


భారత్‌పై ప్రశంసలు వర్షం కురిపించిన ఆయన, చైనాపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం అంతర్జాతీయ చట్టాలను చైనా సవాలు చేస్తోందని ఆయన విమర్శించారు. మొదటి నుంచి చైనాతో అమెరికా నిర్మాణాత్మక సంబంధాలనే కోరుకుందని ఆయన అన్నారు. అయితే భారత్‌ వంటి ఇరుగు పొరుగు దేశాల సార్వభౌమాధికారా లకు నష్టం కలిగించే రీతిలో చైనా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. ఇటువంటి సమయంలోనే భారత్‌కు విశ్వసనీయమైన భాగస్వామి కావాలి. మా భాగస్వామ్య విలువలు ప్రపంచ శ్రేయస్సుకు, శాంతి సుస్థిరతలను కాపాడే విధంగానే ఉంటాయని నమ్మకంగా చెబుతున్నానని టిల్లర్సన్‌ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: