తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి పార్టీ మారాలనే ఆలోచన వెనుక మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు రాష్ట్రం లో  ప్రచారం జరుగుతోంది. ఈ రాజకీయ పరిణామా ల నేపధ్యానికి దర్శకత్వ వ్యూహం నెరిపింది ఆయనే నని తెలుస్తుంది. కాంగ్రేస్ వృద్ధులతో ఇక పనికాదని యువకులు తెరపైకి వెల్లువలా వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి.  రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి కథ, స్క్రీన్‌ప్లే ఇక్కడి నుంచే మొదలైనట్టు తెలుస్తోంది. కార్తీక్‌కు రేవంత్‌తో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా సన్నిహిత సంబంధాలుండడంతో కార్తీక్‌ నివాసం నుంచే రాజకీయ మంత్రాంగం నడిపినట్లు స్పష్టమవు తోంది. ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌తో భేటీ వంటి కీలక అంశాలకు కూడా జిల్లా లోనే బీజం పడిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది.


Image result for kartik reddy behind revant reddy



తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎనుముల రేవంత్‌ రెడ్డి ఇచ్చిన షాక్‌తో ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యం లో రేవంత్‌ పార్టీ మారడంపై వస్తున్న వదంతులపై చర్చించేందుకు సమావేశం కావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం టీ-టీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డితో పాటు ఇంకా ఎవరైనా పార్టీని వీడనున్నారా అనే దానిపై ముఖ్యంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.


మరోవైపు బుధవారం రేవంత్‌ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడటం, ఏపీ మంత్రులు, నాయకులపై విమర్శలుచేయడం వంటి అంశాలను పరిశీలిస్తే, ఆయన కాంగ్రెస్‌ కు చేరువ కావడానికి మానసికంగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న వివరాల ప్రకారం కనీసం 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా అదే బాటలో ఉన్నారని తెలిసింది.


భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కేడర్‌ మారే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే దాదాపు తెలంగాణ టీడీపీ ఖాళీ అయినట్లే అని బలమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేత మోత్కుపల్లి వంటి నేతలే పార్టీలో మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రేవంత్‌ ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి గా చేయాలని పార్టీ శ్రేణులు చెప్పినా చంద్రబాబు ఎల్‌.రమణనే అధ్యక్షుడిగా ప్రకటించడంతో పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. ఆపై పార్టీలో ఎన్నో రాజకీయ సమీకరణాలు మారడంతో చివరకు టీటీడీపీ నే ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందేమోనని పార్టీ అధిష్టానంలో కలవరం మొదలైంది.


మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. తాజాగా రాజకీయాల్లో డేరింగ్‌.. డైనమిక్‌... ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరితే ఇటు వికారాబాద్‌ జిల్లాతోపాటు పొరుగునే ఉన్న పాలమూరు జిల్లాలోనూ పూర్వవైభవం సాధించవచ్చని అంచనా వేస్తోంది. 'ఓటుకు నోటు కేసు' లో ఆయన జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రేవంత్‌ ధ్వజమెత్తుతున్నారు.


Related image


మరోవైపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడానికి కార్తీక్‌రెడ్డి ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ హోంమంత్రులు జానారెడ్డి, మాధవరెడ్డి తనయులు రఘువీర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి కూడా కార్తీక్‌కు ప్రాణ స్నేహితులు. ఈ త్రయంతో రేవంత్‌కు సాన్నిహిత్యం ఉంది. వీరి ప్రోద్బలం కూడా రేవంత్‌ కాంగ్రెస్‌ గూటి వైపు చూసేందుకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న ఉమా మాధవరెడ్డి (సందీప్‌రెడ్డి తల్లి) కూడా త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చెప్పే అవకాశం లేకపోలేదు.


Image result for kartik reddy behind revant reddy


రానున్న కొద్ది రొజుల్లోనే అనేక వ్యూహాలకు రాజకీయ సమీకరణాలకు అంకురార్పణ జరగవచ్చని అభిఙ్జవర్గాల కథనం. ఓటు కు నోటు కేసులో చిక్కినా రేవంత్ ను వెనకుండి నడిపి ఆ ఊబిలో ఆయన్ని నెట్టేసి తెలుగుదేశం అధినేత ఇప్పుడు కుల ఈక్వేషన్ తో కెసిఆర్ కు దగ్గరవటం రాజకీయాలకే అవమానకరం అని, కెసిఆర్ తో దాదాపు యుద్ధమే చేశారు రేవంత్. ఈ సమయంలో తెలుగు దేశం కెసిఆర్ కు అనంతపూర్ లో వంగి వంగి సలాం చేయటం కావాలని స్వంత ప్రయోజనాలకు యనమల, పయ్యావుల, పరిటాల లాంటివాళ్ళు రేవంత్ వ్యూహాలకు దెబ్బకొట్టటం ఈ యువతకు నచ్చలేదు. అద్భుత ప్రణాళిక తో రానున్న ఎన్నికలు తెలంగాణాలో రాజకీయ రణరంగమే సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 


కోదండరాం వీళ్ళకు తోడైతే ఒక్క బిజెపి దక్క అన్నీ వర్గాలు రేవంత్ కు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువ దూరంలో లేవు. కేసిఆర్ నియంతృత్వానికి రెవంత్ నాయకత్వం చెక్ పెట్టే పరిస్థితులు క్రమంగా నెలకొనే సూచనలు కనిపిస్తునాయని రాజకీయ వర్గాల ఉవాచ.   


Image result for kodandaram revanth

మరింత సమాచారం తెలుసుకోండి: