ఎప్పుడూ రాజకీయాల్లో తలమునకలైపోయే రాజకీయ నాయకులు తమ ఆరోగ్యం కోసం కూడా ఎంతో శ్రద్ద వహిస్తుంటారు.  భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి యోగా ప్రాముఖ్యత గురించి దేశ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.  అంతే కాదు భారీ ఎత్తున యోగా డే కూడా నిర్వహిస్తున్నారు.  ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి..అందుకోసం యోగా చేయాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశ్యం.  ఇక సెలబ్రెటీలు యోగా తో పాటు జిమ్ లాంటివి ఆశ్రయించడం తెలిసిన విషయమే. 

గత కొంత కాలంగా తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి.  పన్నీర్ సెల్వం వర్సెస్ శశికళ మద్య జరిగిన పొలిటికల్ వార్..తర్వాత సీఎం సీటు లోకి పళని స్వామి రావడం..సినీ స్టార్ కమల్ హాసన్, రజినీకాంత్ రాజకీయాలపై కొత్త వరవడి తీసుకు రావడం ఇలా ఎన్నో సంచలనాకు కేంద్రంగా మారింది. తాజాగా డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తెలుసు కదా.. ఆయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది. 

ప్రతిసారి పొలిటికల్ వార్ లో కనిపించే స్టాలిన్ ఆయన ఆరోగ్యం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.  64 ఏండ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ.. రాజకీయాల్లో చురుకుగా ఆయన పాల్గొనడానికి కారణమేంటో ఇప్పుడు తెలిసిపోయింది. అంతే కాదు.. ఆయన చేస్తున్న ఒక్కో కసరత్తును ఒక్కో స్ఫూర్తి కలిగించే వాక్యంతో సెట్ చేశారు.  అవే..అటిట్యూడ్ అండ్ ఎఫర్ట్ ఢిపైన్స్ యూ... రైజ్ అప్ ఫర్ చాలెంజ్... గెట్ ఫిట్ ఫర్ లైఫ్.. డూ ఇట్ విత్ ఫాషన్.. లిఫ్ట్ అవే ద పెయిన్.. నెవర్ గివ్ అప్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: