కలవకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణా ఏర్పాటుకోసం ఉద్యమం నడిచే రోజుల్లో తాను తెలంగాణాకు వాచ్-డాగ్ గా రాష్ట్ర రక్షణ భాధ్యత వహిస్థానన్నారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేసి దేశానికే ఆదర్శమౌతానన్నారు. హైదరాబాద్ ను న్యూయార్క్ చేస్తానన్నారు. గృహాలు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూం గృహాలను నిర్మించి ఇస్తానన్నారు. నల్ల తిప్పగానే నీరు వస్తుందని" అలాంటి తాగునీరు సరపరా వ్యవస్థను నిర్మిస్థానన్నారు. ఇలా చెప్పుతూపోతే చాంతాడంత పొడవైన చిట్టా తయారౌతుంది.


ఎప్పుడో ఎక్కడో వినే "జంపింగ్ జపాంగ్" ప్రజాప్రతినిధులు మనకు వీధికుక్కల్లా కనిపిస్తున్నారు ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం అయింది. మతాల, కులాల ప్రాతిపదికన ప్రభుత్వ ఆద్వర్యంలో కార్పోరేషన్లను ఏర్పాటవ్వటం నిత్యకృత్య మైంది. ఇన్ని అవలక్షణాల పాలన వద్దని, తెలంగాణా ఏర్పడే తొలి దశల్లో ఆంధ్రావాళ్ళ నుండి తెలంగాణాను కాపాడాతానని ఎన్నో వాగ్ధానాలు చేశారని ఆ ప్రాతిపధికన తెలంగాణా అభివృద్దిచెందాలని జె.ఏ.సి., నాయకుడు ప్రొ. కొదండరాం గుర్తుచేయటమే తడవుగా ఆయన్ని బూతులతో తిట్టిపోశారు.


Image result for kodanda revanth


దీనికి తోడు రాజకీయాల్లో తెలంగాణాలో ఇప్పటివరకు కనిపించని కుల విభజన కు దారితీసిన తీస్తున్న రాజకీయాలను పెంచి పోషిస్తున్న నాయకత్వాన్ని కెసిఆర్ సృష్టించారు. ప్రజాస్వామ్య రాజకీయాలను ఏక కుటుంబ నియంతృత్వానికి మార్చేసి మరో నిజాం పాలనను ప్రజల కు రుచిచూపిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసి, రెడ్ల ఆధిపత్యానికి చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.


"గత కొంత కాలంగా తెలంగాణలో వినిపిస్తున్న మాట ఇది. టీఆర్ఎస్‌ తో దోస్తీకి చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ ముఖ్యులు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు టీడీపీ నేతలైతే ఒకడుగు ముందుకేసి తెలంగాణలో టీఆర్ఎస్‌, బీజేపీ లతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఈ "వెల్‌ కమ్" అనే నూతన బంధం కేసీఆర్ అంటే ఏ మాత్రం గిట్టని టి-టిడిపి నేత రేవంత్ రెడ్డికి నచ్చలేదు. 'నోటుకు ఓటు కేసు' లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న ఆయన కేసీఆర్‌ను సీఎం పీఠం నుంచి దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కానీ టి-టిడిపి పార్టీ పెద్దల ఆలోచన, కార్యాచరణ అందుకు విరుద్ధంగా ఉంది.


Image result for kodanda revanth


దీంతో రేవంత్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో రెడ్లు అధికంగా ఉండే కాంగ్రెస్ వైపు దృష్టి సారించాల్సి వచ్చింది. ఇది రేవంత్‌కు ఎంత మేర ఉపయోగం అనేది పక్కన బెడితే, తెలంగాణ టీడీపీకి చెందిన మోత్కుపల్లి నర్సింహులుకు మాత్రం అనుకోని ప్రయోజనం కానుంది. ఆయనకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు చాలా కాలం క్రితమే హామీ ఇచ్చారు. వెంకయ్య నాయుడి నోట కూడా గతంలో మీరు గవర్నర్ అవుతారనే మాటలు వెలువడ్డాయి. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు కానీ, మోత్కుపల్లికి మాత్రం ధారుణమైన నిరాశే ఎదురైంది.


గవర్నర్ పదవి హామీని మోత్కుపల్లి పదే పదే చంద్రబాబు కు గుర్తు చేస్తుండటంతో పార్టీ అధినేత కూడా ఏం చేయలేని స్థితిలో ఉండిపోయారు. ఇది మోత్కుపల్లికి దొరికిన అవకాశం దాంతో ఆయన తన రాజకీయ అవసరం తీర్చుకుంటారు. ఇప్పుడు రేవంత్ బయటకు వెళ్లడం వల్ల మోత్కుపల్లి కి పార్టీలో ప్రాధాన్యం పెరుగుతుంది. టీఆర్ఎస్‌తో దోస్తీ వల్ల ఎంపీగా పెద్దల సభలో అడుగుపెట్టినా ఆశ్చర్యం అక్కర్లేదనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కేసీఆర్ స్కెచ్ వేస్తే, దాన్ని మోత్కుపల్లి తనకు అనుకూలంగా మలచుకోనున్నారన్న మాట.


Image result for kodanda revanth


ఇలా కొత్త కొత్త రాజకీయ అవలక్షణాలు తెలంగాణా ప్రజలకు పరిచయం చేస్తున్నారు కెసిఆర్ తన స్వహస్తాలతో.  అయితే ఓటుకు నోటు కేసు పై శ్రద్ధ పెట్టి వీలైతే తన ఆగర్బ శత్రువు రెవంత్ ను చెరసాల పాలు చేస్తామని ప్రయత్నిస్తే తన కుల రాజకీయాలకు కుల బంధాలకు అడ్డుకట్ట పడి తను ఆంధ్రా కాంట్రాక్టర్ల నుండి పొందే ప్రయోజనాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని కెసిఆర్ కు తెలుసు. అందుకే ఓటుకు నోటు చక్రబంధం లో కెసిఆర్ కూడా అనాలోచితంగా ఇరుక్కుపోయారు.  

ఈ ప్రయోగంతో కెసిఆర్ పాలనలో తెలంగాణా ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలు కుల రాజకీయలకు దఖలు పడుతున్నా యని, తెలంగాణా ఉద్యమంలో కెసిఆర్ ప్రజలకు చేసిన వాగ్ధానాలను కృష్ణలో కలిపేశారని, కోదండరాం యుద్ధం ప్రకటించనే ప్రకటించారు.


Image result for kodanda revanth


మరోవైపు రెవంత్ రెడ్లపై కేసిఆర్ శతృభావనలో ఉన్నారని ప్రచారం ప్రారంభిస్తారు. మిగిలిన ప్రతిపక్షాలు పార్టీ ఫిరాయింపులతో కోల్పోయిన ప్రతిష్ఠ తిరిగి పొందటానికి ఆయన సహజ సిద్ధమైన కుటుంబపాలన, నియంతృత్వం, రాష్ట్రం మిగులు బడ్జెట్ తో ఏర్పడి కూడా ధారుణ ఋణ ఊబిలో కూరుకు పోవటం, విశ్వనగరం విశ్వంలోనే అతిపెద్ద నరకంగా మారటం, బ్రతుకమ్మలు లాంటి కుటుంబాలకు ప్రజలకు పరిమిత మైన పండుగలు, ప్రభుత్వ పండగలుగా మారి తడిసిమోపెడయ్యే ఋణభారంతో రాష్ట్రం దారిద్రానికి నెలవుగా మారే పరిస్థితులను ప్రచారాస్త్రాలుగా మార్చుకోనున్న తరుణం లో రేపు ఎన్నికల ప్రచారం లో కెసిఆర్ నెగ్గుకు రావటం చాలా కష్టమే.


కేసిఆర్ స్వయం కృతాపరాధం "బాస్మాసుర హస్తం"లా, మారి పోయింది. అందుకే ప్రొ. కోదండరాం ఆరునెల్లలో తెలంగాణా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని చెప్పటం తెలంగాణా భవిష్యత్ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రాష్ట్రం కులాల కుంపట్లలో తగలబడే అవకాశాలు పుష్కలం. అసలే కేసిఆర్ కు వంగి వంగి సలాం చేసిన వారే వారి స్వార్ధం కోసం రాష్ట్ర విభజనకు కూడా సహకరించారు గంపగుత్తగా. అలాంటి వాళ్ళతోనే ఇప్పుడు తెలంగాణా కులాల అగ్నికీలల్లో తగలబడరాదని కోరుకుందాం! అంతకంటే ఏంచేయగలం. 


Related image


రాజకీయ ప్రయోజనాలు, అధికార కాంక్ష ముందు ఏ బంధం ఎక్కువ కాలం నిలబడలేదని అర్ధం అయ్యింది. నిజానికి ఇప్పుడు రేవంత్ ఆరోపణలు చేస్తున్న పయ్యావుల ఒకప్పుడు ఆయనకి మంచి మిత్రుడు. 2004 నుంచి 2014 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబుకి కంటెంట్ పరంగా పూర్తి స్థాయిలో అండగా నిలిచారు కొందరు యువ నేతలు. వీరిలో రేవంత్, పయ్యావుల, ధూళిపాళ్ల నరేంద్ర, వేం నరేందర్ రెడ్డి ఇంకా క్లోజ్ గా వుండే వాళ్ళు. వై.ఎస్ ని దీటుగా ఎదుర్కొనే రాజకీయ వ్యూహాల్లో చురుగ్గా వుండే ఈ నలుగురిని ఒక్కటిగా చూసినప్పుడు కాంగ్రెస్ నేతలు కొందరు సరదాగా టీడీపీ యంగ్ టర్క్స్ అని పిలిచేవాళ్ళు. ఆ యంగ్ టర్క్స్ ని రాష్ట్ర విభజన ముందుగా కాస్త దూరం చేసింది. అయినా వీళ్ళు అవకాశం వున్నప్పుడు కలుస్తూనే వుండేవాళ్ళు.


కానీ ఇప్పుడు అనూహ్యంగా మిత్రుడు పయ్యావుల మీదే రేవంత్ ఆరోపణలు చేశారు. "దోస్త్ ని జైలుకి పంపినోడు పిలిస్తే మాత్రం వెళ్ళాలా?"  అని రేవంత్ అన్న మాటల్లోనే వారు ఇద్దరూ ఎంత క్లోజ్ అన్నది అర్ధం అవుతుంది. ఇక రెండు వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తూ పాత స్నేహాన్ని కొనసాగించడం కష్టం అయ్యేలా ఉందేమో. ఇప్పుడు తెలంగాణాకి పాకుతున్న కుల రాజకీయాల నేపథ్యంలో ఈ యంగ్ టర్క్స్ లో ఒక్కరైన వేం నరేందర్ రెడ్డి ఏ స్టెప్ తీసుకుంటారు అన్నది సర్వత్రా ఆసక్తి కరంగా మారింది. రేవంత్ తో పాటు మరికొందరు టీడీపీ నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవచ్చు అన్న అంచనాలు నెలకొంటున్న తరుణంలో వేం రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందో ?


Image result for kodanda revanth

మరింత సమాచారం తెలుసుకోండి: