రేవంత్ రెడ్డి ఏ పార్టీ లో జేరతారు, నిజంగా జేరతారా లేదా అనే విషయం కూడా ఇంకా ఖరారు అవ్వలేదు. ఇలోగా అప్పుడే రకరకాల విశ్లేషణలు మొదలు అయ్యాయి. రాహుల్ గాంధీ తో నిజంగా రేవంత్ భేటీ అయ్యారో లేదో వీ హనుమంతరావు వ్యాఖ్యలు భలే ఆశ్చర్యం తెప్పిస్తున్నాయి.



రేవంత్ ను తాను ఎప్పుడో పార్టీలోకి ఆహ్వానించాన‌ని సీనియ‌ర్ నేత వీ హ‌న్మంత‌రావు చెబుతున్నారు. టీడీపీలో ఉండి ఏం సాధిస్తావ‌ని గ‌తంలో ఓసారి తాను ప్ర‌శ్నించానీ, కేసీఆర్ పై పోరాటం చేయాలంటే కాంగ్రెస్ ఒక్క‌టే స‌రైన వేదిక అని రేవంత్ కి ఎప్పుడో చెప్పాన‌ని అన్నారు. " ఆ పోరాటం ఏదో కాంగ్రెస్ లో ఉండి చెయ్యవయ్యా బాబూ అని అడిగాను నేను.



ఇది ఇప్పటి సంగతి కాదు. రేవంత్  లాంటి నాయకుడు మా పార్టీ లో ఉంటే మాకే మంచిది అని నేను ఆనాడే రాహుల్ లాంటి వాళ్ళకి చెప్పాను. టీడీపీ లో కూర్చుని ఎంత గొప్ప పోరాటం చేసినా ఉపయోగం ఉన్నట్టు ఏమీ కనపడ్డం లేదు అని ఆనాడే అన్నాను నేను అతనితో  " అన్నారు హనుమంతరావు. 



రాజ‌కీయంగా తానొక్క‌డే మోనోపొలీ కావాల‌న్న‌ట్టుగా ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల్ని కేసీఆర్ పిలుచుకున్నార‌నీ, కాబ‌ట్టి ఆయ‌న‌కి వ్య‌తిరేకంగా పోరాడాలంటే అంద‌రూ చేతులు క‌ల‌పాల‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెరాస వ్య‌తిరేకంగా పోరాడేవాళ్ల‌ను క‌లుపుకుని పోవాల‌న‌దే హైక‌మాండ్ ఆలోచ‌న అనీ, రేవంత్ పార్టీలోకి వ‌స్తే మంచిదే, బాగానే ఉంట‌ది
హనుమంతరావు వాదన.


మరింత సమాచారం తెలుసుకోండి: