టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కి సంబంధించి అనేక విశ్లేషణ లూ డిస్కషన్ లూ మొదలు అయ్యాయి. రాజకీయ వర్గాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మరి. టీడీపీ ఈ విషయం లో ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది.


రేవంత్ రెడ్డి వీరంగం ఆడేస్తూ ఏపీ మంత్రులకి సంబంధించి, వారి కీ కెసిఆర్ కీ మధ్యన ఉన్న లాలూచీలు ఇంకా అనేక నిజాలు బయట పెడుతున్నా అంటూ ఆరోపణలు చెయ్యడం తో వైకాపా కి టీడీపీ జుట్టు చిక్కినట్టు అయ్యింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణూ ప్రస్తుతం వైకపా లో ఉన్న సంగతి తెలిసిందే.



ఇప్పుడు ఆయన మీడియా సాక్షి గా టీడీపీ ని కడిగేస్తున్నారు. ఆయనతో పాటు చాలామంది వైకాపా వారు టీడీపీ ని టార్గెట్ చెయ్యడం కోసం రేవంత్ మాటలు వాడుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ కాంట్రాక్టు దక్కించుకున్నారా? లేదా? అనే విష‌యాన్ని కూడా టీడీపీ బ‌య‌ట చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి బంధువు సుధాకర్‌ యాదవ్ కూడా కాంట్రాక్టు దక్కించుకున్నార‌ని ఆరోపించారు.



రేవంత్ రెడ్డి చేసిన ప్రతీ ఆరోపణ లోనూ నిజం ఉంది అని, తమదగ్గర సమాచారం ఉంది అనీ ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం తన సొంత మనిషిని కాపాడుకునే ప్రయత్నం పక్కకి పెట్టి జనాలకి నిజాలు తెలియజేసే బాధ్యత తీసుకోవాలి అని ఆయన కోరారు. చంద్రబాబు విదేశీ పర్యటన, రాజధాని నిర్మాణం ఇలా అనేక విషయాల్లో స్కాం లు జరుగుతున్నాయి అని ఆరోపించారు ఆయన. 


మరింత సమాచారం తెలుసుకోండి: