బీహార్ లో నాగరిక సమాజం సిగ్గుపడే సంఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా బాధ్యత కలిగిన ఓ గ్రామ సర్పంచ్ దారుణంగా ప్రవర్తించాడు.  సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూపిస్తూ..ఉంటారు.  కానీ ఇప్పటికీ ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నారని మరోసారి రుజువైంది.  దేశం ఎంతో అభివృద్ది సాధిస్తున్నా...మనుషులంతా ఒక్కటే అని చాటి చెబుతున్నా కొంత మంది అప్రయోజకులు చేస్తున్న నిర్వాకం వల్ల పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

వివరాల్లోకి వెళితే.. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత జిల్లా నలందలోని అజ్‌పూర్‌లో   చెందిన 54ఏళ్ల వృద్ధుడికి దారుణమైన శిక్ష విధించింది స్థానిక పంచాయితీ. కేవలం తలుపు తట్టకుండా ఇంట్లోకి ప్రవేశించాడన్న నెపంతో ఓ సామాన్యుడిని ఘోరంగా అవమానించాడు ఆ ఊరి సర్పంచ్. తనకు రావాల్సిన ప్రభుత్వ పథకాల గురించి బాధితుడు సర్పంచ్ నివాసానికి వెళ్లాడు. దీంతో ఆ వృద్ధుడిని నేలపై ఉమ్మి, ఆ ఉమ్మును మళ్లీ నాలికతో తాకాలని ఆదేశించారు గ్రామపెద్దలు.మహిళల చేతికి చెప్పులిచ్చి అతడిని కొట్టించారు.

ఈ తతంగం అంతా ఓ ఔత్సహికుడు తన సెల్ ఫోన్ లో రికార్డు చేయడం అది కాస్త వైరల్ అయ్యింది.  ఇది కాస్త ప్రభుత్వం దృష్టికి చేరడంతో.. బీహార్ కేబినెట్ మంత్రి నందకిశోష్ యాదవ్ శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలకు చోటేలేదు. నిందితులపై విచారణ జరిపించి.. మళ్లీ ఇలాంటివి జరక్కుండా కఠిన చర్యలు తీసుకుంటాం...’’ అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: